Breaking News

ఏపి ఎస్ఈసి నిమ్మగడ్డ కేసులో కొత్త ట్విస్ట్.. జగన్ సర్కార్ అడుగు వెనక్కి..!

02 nd Jun 2020, UTC
ఏపి ఎస్ఈసి నిమ్మగడ్డ కేసులో కొత్త ట్విస్ట్.. జగన్ సర్కార్ అడుగు వెనక్కి..!
ఆంధ్ర ప్రదేశ్ ఎస్ఈసి గా నిమ్మగడ్డ నే నియమించాలని హై కోర్ట్ తీర్పుని ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విషయం లో తీర్పుపై స్టే ఉంచాలంటూ జగన్ సర్కార్ పిటిషన్ వేసింది. తాజాగా...పిటిషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. జస్టిస్ కనగరాజ్ తరఫున వేసిన స్టే పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకున్నారు. నిమ్మగడ్డ తరపున దాఖలైన పిటిషనర్లకు ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించగా.. ఏమీ లేవనడంతో పిటిషన్ వెనక్కు తీసుకునేందుకు ఓకే చెప్పింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ వేయడంతో.. హైకోర్టు పిటిషన్‌ను వెనక్కు తీసుకుంది. 
          ఇది ఇలా ఉంటె.. మరోవైపు  సుప్రీంకోర్టులో మరో కేవియట్ పిటిషన్ దాఖలైంది. నిమ్మగడ్డ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కేవియట్ వేశారు. ఆయన తో పాటుగా ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి కూడా కేవియట్ దాఖలు చేశారు. దీంతో ఈ సంఖ్య రెండుకు చేరింది. ఇది ఎటువైపుకు సాగుతుందో వేచి చూడాలి.. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox