ఆంధ్రప్రదేశ్ :పాలనా వికేంద్రీకరణ,
సీఆర్డీఏ రద్దు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. కార్యాలయాల తరలింపుపై యథాతథస్థితి కొనసాగించాలంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు 27 వరకు పొడిగించింది. స్టేటస్ కో ఉత్తర్వుల వల్ల ఇరుపక్షాలకు నష్టమని, అందువల్ల వాటిని ఎత్తివేయాలని, రాజధానిని మార్చడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
రాజధానితో పనిలేకుండా కార్యాలయాలను ఎక్కడైనా ఏర్పాటుచేసుకునే అధికారం తమకుందని నివేదించింది. యథాతథస్థితి ఉత్తర్వులవల్ల సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు కూడా ఆగిపోయే పరిస్థితి తలెత్తిందని తెలిపింది. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. అయితే, హైకోర్టు అందుకు నిరాకరిస్తూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
మరిన్ని వార్తలు చదవండి.