Breaking News

విశాఖలో వేడెక్కిన రాజకీయం..!

13 th Aug 2020, UTC
విశాఖలో వేడెక్కిన రాజకీయం..!

ఆంధ్రప్రదేశ్ : ఉత్తరాంధ్ర కేంద్ర బిందువు, కాబోయే పరిపానా రాజధాని కేంద్రం అయిన విశాఖలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా తాజా, మాజీ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు నడుమ నువ్వా నేనా అన్నంతలా రాజకీయ కాక రాజుకుంటోంది. టీడీపీ నుండి ఎలాగైనా బయటపడి అధికార వైఎస్ఆర్సీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్న విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రత్యర్ధి ప్రస్తుత పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకించడం. గంటాకు తలనొప్పిగా మారింది. గంటా అనుచరుల భూ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం అరెస్టవడవం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అయింది. దీంతో విశాఖ భూకబ్జాల పర్వం కాస్తా రాజకీయ రచ్చకు దారితీస్తోంది.

ఉత్తరాంధ్రాలో బలమైనా లీడరుగా గంటా శ్రీనివాసరావుకు విపరీతమైన పేరు ఉంది. గత రెండు దశబ్దాలనుంచి ఓటమి అన్నది ఎరుగకుండా వరుసగా నాలుగు పర్యాయాలు ఎంఎల్ఏ గా గెలుపొందిన గంటాకు. ప్రతీ ఎన్నికల్లోను ఒకో కొత్త నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే  గంటా గతంలో తేదేపా , కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వరుసగా మూడు సార్లు మంత్రి పదవి చేజిక్కించుకున్నారు. అయితే 2019ఎన్నికల్లో టీడీపి తరుపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏ గా పోటీ చేసి గెలుపొంది నప్పటికి వైకాపా అధికారంలోకి రావడంతో గంటాకు చుక్కెదురైంది. అప్పటినుంచి ఎలాగైనా వైకాపాలోకి చేరాలని రకరకాల ప్రయత్నాలు చేస్తునే ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాని జగన్ వైకాపాలోకి రావాలంటే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి రావల్సిందేనంటూ ప్రకటించడంతో ఎటూ పాలుపోని స్తితిలో ఉన్న గంటా అప్పటినుంచి ఒకింత అజ్ఝాతంలో ఉన్నారనే చెప్పాలి.అంతేకాదు. పేరుకి టీడీపి ఎంఎల్ఏ అయినప్పటికి పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడూ హజరైన దాఖలాలు లేవు.  కనీసం చంద్రబాబు వైకాపా పార్టీపై కార్యక్రమాలను తప్పుపడుతూ ధర్నాలు , నిరసనలు తెలియజేయండని ఇచ్చిన పిలుపులకు సైతం గంటా ఎక్కడా స్పందించిన దాఖలాలు లేవు.

అంతేకాదు,టీడీపీలోని తన సహచర నేతలు అచ్చెన్నాయుడు, జేసీ అరెస్టైనా బయటకు రాకుండా మీడియా కంటపడకుండా స్తబ్దుగా ఉన్నారు. అయితే తాను టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న భూ ఆరోపణలను అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎలాగోలా నెట్టికొచ్చారు. కానీ,వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి కేసుల్లో టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా ఇరుక్కుంటుండడంతో తాను కూడా  భారీ  మూల్యం చెల్లించుకోక తప్పదని భావించిన గంటా,ఎంఎల్ఏగా రాజీనామా చేసైనా వైకాపాలో చేరాలని పావులు కదుపుతున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే  గంటా వైసీపీ తీర్ధం తీసుకొనేందుకు సైతం ముహూర్తం ఖరారైందంటూ అనేక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే గంటా అనుచరుల భూభాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటం, ప్రధానంగా గంటా తేదేపా మంత్రిగా ఉన్నప్పుడు బీమిలీ నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్నతన మేనల్లుడు చిక్కాల విజయ్ చేసిన కబ్జాల పర్వం పోలీస్ స్టేస్టన్ మెట్లెక్కడం వారి అనుచరులు అరెస్టవడం వంటి వరుస ఘటనలు.ఈ మాజీ మంత్రికి బ్రేకులు వేసినట్లైంది. గంటాను వైసీపీలోకి రాకుండా అడ్డుకునేందుకు ఎదురుచూస్తున్న మంత్రి అవంతి శ్రీనివాస్‌కి ఇదో బ్రహ్మోస్త్రంగా మారింది.

దీంతో,గంటా పార్టీలోకి వస్తే తన మంత్రిపదవికి సైతం రాజీనామా చేసేస్తానని అవంతి అధిష్ఠానం వద్ద కాస్త తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో గంటా వైసీపీలోకి చేరే అంశం జఠిలం అయినట్టు కనిపి స్తోంది. ఇద్దరూ ఒకప్పుడు టీ డీపీలో మంచి మిత్రులే, ఇద్దరికీ బీమిలి నియోజకవర్గం కావాల్సి రావడంతో, ఇద్దరూ రాజకీయ శత్రువులుగా మారారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణు ప్రత్యారోపణలు ఘాటుగానే చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా తాజాగా గంటా సైకిళ్ల కుంభకోణం ఎక్కడ బైటకు తీస్తారోనని భయపడి వైసీపీలోకి దొడ్డిదారిన వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నారని మంత్రి అవంతి కూడా బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.

ఇదిలా ఉంటే గంటా శ్రీనివాసరావు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా వైసీపీలోకి వెళ్లేం దుకు మార్గం సుగమం చేసుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఉత్తరాంధ్ర జిల్లాు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డి  క్వారెంటైన్లో హైద్రాబాద్‌లో ఉంటున్నారు. సరిగ్గా ఇదే అదను చూసుకుని గంటా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణారెడ్డిని ఆశ్రయించారు. తాను పార్టీలోకి వస్తుంటే కొందరు అడ్డుకొంటున్నారని, విజయసాయిరెడ్డి అవంతి మాటలు విని, తనను పార్టీలోకి తీసుకోవడంపై గ్రీన్సిగ్నల్ ఇవ్వట్లేదని గంటా సజ్జవద్ద  గోడు వెళ్లబోసుకున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో సజ్జల ఆయన పార్టీ చేరిక అంశంపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలిస్తుంది. దీంతో అవంతి శ్రీనివాస్‌ పార్టీ అధిష్ఠానంలోని మరో పెద్ద అండతోనే గంటా రాకను అడ్డుకునేందుకు వేగం పెంచినట్టు  సమాచారం. దీంతో సజ్జల వద్దకు మొత్తం పంచాయితీ చేరింది. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం గంటా రాకపై పార్టీలో ఎటువంటి వ్యతిరేకత, నిరసనలు లేకుంటేనే పార్టీలోకి తీసుకోవాని తెలిపినట్టు సమాచారం. అయితే ఒకవైపు ఇలా ఉంటే, మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనా రాయణను పాత్రికేయు సమావేశంలో గంటా చేరికకు సంబంధించి ప్రశ్నించినప్పుడు గంటా వస్తే తప్పేంటి అని నర్మగర్భంగా చేసిన వ్యాఖ్య ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
 
కాగా, విశాఖ త్వరలో పరిపాలనా రాజధాని నగరంగా మారనున్న సంగతి తెలిసిందే. విశాఖ నగరపాక సంఘం ఎన్నిక సమయానికి విశాఖ నగరంలోని టీడీపీ ఓటు బ్యాంకు బలంగా ఉన్న ఈస్టు వెస్ట్, సౌత్, నార్త్ నియోజకవర్గాు వైసీపీకి అనుకూల ఓటు బ్యాంకుగా మార్చుకోవాలన్నది వైసీపీ ఎత్తుగడగా తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు  ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నసంగతి తెసిందే. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్చార్జుల పాలన సాగిస్తున్నప్పటికీ, టీడీపీ నుండి క్యాడర్‌ను  చేర్పించుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే గంటాను పార్టీలోకి తీసుకుంటే, వైసీపీకి మరింత బలం చేకూరుతుంది అన్నది సజ్జల రామకృష్ణారెడ్డి ఎత్తుగడగా తెలుస్తోంది. అయితే అవంతి శ్రీనివాసరావుతో పాటు ఆయన వర్గీయు మాత్రం గంటా వస్తే, భవిష్యత్లో  రాజకీయ పరిణామాు, తద్వారా ఏర్పడబోయే ప్రయోజనాను బేరీజు వేసుకొంటున్నారని, అందుకే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని సమాచారం.

అయితే, గంటాకు విశాఖలో గట్టి పట్టు ఉందన్న సంగతి ఎంత నిజమో, వైసీపీలో చేరడం ద్వారా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అప్పనంగా కొట్టేసిన భూములను కాపాడుకోవచ్చన్న ఐడియా కూడా అంతే వాస్తవమని కొందరు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక, మధురవాడ వికలాంగుల కోలనీలో ప్రభుత్వం వికలాంగులకు కేటాయించిన స్థలాలను గంటా మంత్రిగా ఉండగా అతని ప్రధాన అనుచరుడు ఒకరు కొల్లగొట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ గంటా అనుచరులు కొందరిని వికలాంగుల కాలనీలో అక్రమంగా ప్లాట్లను కాజేసారని పీఎం పాలేం పోలీసులు అరెస్ట్ చేయడం. గంటా అనుచరులు తమ స్థలాలను అక్రమంగా కబ్జా చేసారంటూ  కొంత మంది మహిళలు ధర్నాకు దిగడం గంటాకు మింగుడు పడడంలేదు. దీన్ని అవంతి వర్గం ప్రధానాస్త్రంగా తీసుకుంటోంది. గంటా వైసీపీలోకి చేరడానికి ప్రయత్నిస్తున్నారంటేనే, సంవత్సరం కాలంగా స్తబ్దుగా ఉన్న ఆయన అనుచరగణం రెచ్చిపోతున్నారని, ఇక గంటా పార్టీలోకి వస్తే పరిపాలనా రాజదాని ప్రాంతంలోని భూములన్నింటినీ మాయం చేస్తారని ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో గంటా వైసీపీలో చేరడం అంత తేలిక కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఇంతకీ గంటా ఎంట్రీకి వైసీపీ అధిష్టానం ఎస్‌ చెబుతుందో నో చెబుతుందో అన్న అంశంపై ఇప్పుడు తీవ్ర ఆసక్తికరమైన అంశంగా మారింది. ప్రస్తుతం విశాఖాలో ఏనోట విన్న ఇదే విషయంపై రాజకీయ రచ్చ జరుగుతుంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox