Breaking News

అంతిమ యాత్రకు ప్రభుత్వ ఏర్పాట్లు..!

29 th Jul 2020, UTC
అంతిమ యాత్రకు ప్రభుత్వ ఏర్పాట్లు..!

        ఆంధ్రప్రదేశ్ :  ప్రస్తుతం భారత్ లో ఎదురవుతున్న పెద్ద సమస్య కరోనా.ఈ మహమ్మారి ఎక్కడ సోకుతుందో అని యావత్ భారతం తగు జాగ్రత్తల్లో ఉంటోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా,ఈ మహమ్మారి కాటు వేస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆసుపత్రి బెడ్ ల నుంచి.మరణిస్తే దహన వాటికల దాకా,ప్రతి విషయం లో కొరత, ఇతర ఇబ్బందులు తప్పడం లేదు. మరో వైపు కరోనా తో మరణిస్తే వారిని దహనం చేయడానికి గ్రామాల ప్రజలు ఒప్పుకోవడం లేదు. మరో వైపు పట్టణాల్లో సరైన సదుపాయాలు లేకపోవడం,జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా మరిన్ని ఇబ్బందులు ఎదురవుతుండడంతో ధర్మ ప్రకారంగా జరగాల్సిన అంత్యోష్టి కి అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? కొత్త దహన వాటిక ల ఏర్పాట్లకు ప్రభుత్వం ఏమి చేసింది?
 
              ప్రస్తుత మానవ జీవితం దుర్భరంగా సాగుతోంది. ఉరుకుల పరుగుల జీవన స్రవంతికి కరోనా బ్రేకులు వేసింది. కానీ రోగం కంటే దురదృష్టకర పరిస్థితి ఏమిటంటే కరోనా తో మరణిస్తే పట్టించుకునే నాధుడు లేకపోవడం. అందరు ఉన్నా అనాథలా దూరమవ్వాల్సి రావడం కన్నా అమానవీయ సంఘటన ప్రస్తుత పరిస్థితిల్లో ఇంకోటి లేదనిపిస్తుంది. పుట్టేటప్పుడు,పోయేటప్పుడు మనకి ఎవ్వరు తోడు  రారు. కానీ భౌతిక శరీరాన్ని దహనం చేయడానికి కూడా ఒక్క మనిషి ముందుకు రాకపోవడం వంటి సంఘటనలు తలుచుకుంటుంటుంటే ఒళ్ళు గగుర్పొడుస్తూ ఉంటుంది. మనం దేహాన్ని వీడిన తరువాత ఆ దేహాన్ని మోయడానికి కనీసం నలుగురు వచ్చేలా బతకాలని నీతి  వ్యాఖ్య.కానీ నేడు పరిస్థితులన్నీ తారుమారయ్యాయి.
              మీ వాళ్ళు చనిపోయారని ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేసి చెప్పినా కూడా కొందరు ఆసుపత్రికి రావడానికి జంకుతున్నారు. మరో వైపు కరోనా సోకినా భౌతిక దేహాన్ని తీసుకువెళ్తే దహనం చేయడానికి గ్రామస్తులు ఒప్పుకోరు. కొన్ని చోట్ల ఎంత బ్రతిమిలాడుతున్నా సిబ్బంది దేహాన్ని ఇవ్వడం లేదు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఇందులో ఎవరి తప్పు లేదు. పరిస్థితులే అలా వచ్చాయి.కారణం ఏదైనా కరోనాతో మరణించిన వారి దహన సంస్కారాలు నిర్వహించడం మున్సిపాలిటీ  సిబ్బందికి సమస్యగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఇప్పటికే పలువురు మున్సిపాలిటీ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు.

         ఇప్పటికే దేశంలో అత్యధికంగా కరోనా పరీక్షలు చేస్తున్నా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రములో అంతిమ సంస్కారాలకు ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రములో కొత్తగా దహన వాటికలను ఏర్పాటు చేయడానికి భావిస్తోంది. ఎవరూ వ్యతిరేకించకుండా ఉండే ప్రభుత్వ స్థలాలలో ఈ దహన వాటికలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.51.48 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా 38 దహన వాటికలను నిర్మించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి కనీసం ఒకటి చొప్పున ఉండేలా ఏర్పాట్లు చేయదలిచారు. ఇప్పటికే దీనికి సంబంధించి టెండరింగ్ ప్రక్రియను పూర్తి చేసి, వచ్చే నవంబరు నెలాఖరు కల్లా అందుబాటులోకి తేనున్నట్లు పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల ఓ ప్రకటన లో తెలిపారు.
           పట్టణ ప్రాంతాల్లో మరణించిన వారి అంతిమ సంస్కారాల నిర్వహణకు సరైన సదుపాయాలు లేని వైనం, కోవిడ్ పరిస్థితులు, సంప్రదాయబద్ధంగా కర్రలను ఉపయోగిస్తున్న నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మరణించిన వారి అంత్యక్రియల నిర్వహణకు పర్యావరణ హితమైన ఏర్పాట్లు ఉండేలా చూడాలన్న ముఖ్యమంత్రి వైయఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. పర్యావరణ హితంగా, ఎల్పీజి తో నిర్వహించేలా దహన వాటికల నిర్మాణం, శ్మశానాల్లో మౌలిక వసతుల కల్పన వంటివి ఈ పనుల్లో భాగంగా చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. రూ.51.48 కోట్లలో 37 దహనవాటికల ఏర్పాటుకు రూ.15.92 కోట్లు, 35 శ్మశానాల్లో వసతుల కల్పనకు రూ.35.56కోట్లను ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.
            కరోనా మరణాలు మొదలైన దగ్గరనుంచి దహన సంస్కారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో జరుగుతున్న అమానవీయ ఘటనలు చూస్తుంటే కడుపు తురుక్కుపోతుంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టడానికి, పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశలో ప్రభుత్వం దహన వాటికల నిర్మాణం, శ్మశానాల్లో వసతుల కల్పన పనులను చేపట్టిందని ఆయన అన్నారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అమలులో ఉన్న భౌతిక దూరం వంటి ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని, అంత్యక్రియలనేవి గౌరవప్రదమైన రీతిలో జరిగేలా అన్ని చర్యలు తీసుకుటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆయా శ్మశాన వాటికల్లో గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ ఆధారిత చిమ్ని, కార్యాలయ భవనం, సంప్రదాయబద్దంగా కార్యక్రమాల నిర్వహణకు అనువైన హాల్, టాయిలెట్లు, నీటి సరఫరా , డ్రైనేజి లేన్ నిర్మాణం తోపాటు ఇతరత్రా ల్యాండ్ స్కేపింగ్ పనులు, ప్రహారీ నిర్మాణం వంటి పనులను ఈ నిధులతో చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడంతోపాటు, పర్యావరణ హితంగా ఉండేలా ఎల్ పిజి ద్వారా దహనవాటికలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.  
             హిందూపుర్, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 3 చొప్పున దహన వాటికలు, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు, కడప, కర్నూలు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గాల్లో 2 చొప్పున, మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున వీటిని ఏర్పాటు చేయనున్నారు. నవంబరు నెలాఖరు నాటికల్లా ఈ పనులన్నీ పూర్తి అయ్యేలా చూడాలని ప్రజా ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ చీఫ్ కు మంత్రి  ఆదేశాలిచ్చారు.
           ఈ కరోనా మహమ్మారి తీసుకొచ్చిన కష్టాలు అన్ని ఇన్ని కావు.. బతుకుల్ని కఠినంగా మార్చడమే కాదు. మరణాలని కూడా కఠినతరం చేసి మానవుల్లో మిగిలి ఉన్న కాస్త మానవత్వాన్ని కూడా తుడిచిపెట్టేస్తోంది. ఈ పరిస్థితిల్లో అంత్యోష్టి కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కనీస సౌకర్యాలు హర్షించదగ్గవి. కరోనా బాధితుల కోసం ప్రభుత్వం చేస్తున్న ఈ ఏర్పాట్లు త్వరలోనే అందుబాటులోకి రావాలని కోరుకుందాం. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox