Breaking News

ధవళేశ్వరం సమీపంలో ప్రమాదం దిశగా గోదావరి..!

15 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :వరుసగా రోజు కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరిలో నీటి మట్టం ఎక్కువగా పెరుగుతోంది. వరుస పెట్టి భారీగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతి మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.ధవళేశ్వరం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడక్కడ ఔట్ ఫ్లో 9.84 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు.
  
అయితే, గోదావరి ఉద్ధృతం పెరుగుతుండడంతో నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు మరిన్ని జాగ్రత్తలతో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా,  దేవిపట్నం మండలంలో దాదాపు 36 గ్రామాలూ జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలూ ఇతర గ్రామాలనుంచి వేరుపడినట్లు అయిపోయాయి. పైగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గన్నవరం నియోజకవర్గంలోని చాకలిపాలెం కాజ్ వే మునిగిపోయింది. దీనితో సమీప లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే భద్రాచలం వద్ద  మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. ప్రస్తుతం అక్కడ నీటి మట్టం 45 అడుగులుగా ఉంది. అయితే, ఈ నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox