Breaking News

గంట వైసీపీ లోకి చేరతారా?

04 th Aug 2020, UTC
గంట వైసీపీ లోకి చేరతారా?

ఆంధ్రప్రదేశ్ :వైసీపీ పార్టీ లోకి చేరడానికి పలువురు రాజకీయ నాయకులూ సిద్ధం అవుతున్నారు. టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి రెడీగా ఉంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీలో పదవి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపధ్యంలో మరింత మంది టీడీపీ నాయకులు వైసీపీ లోకి చేరబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
         తాజాగా, టీడీపీ మాజీ మంత్రి గంట శ్రీనివాసరావ్ కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. వైసీపీలో గంటా చేరబోతున్నారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. ఆగస్ట్ 15వ తేదీన వైసీపీ కండువా కప్పుకోబోతున్నారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే,తాజాగా ఈ ముహూర్తం పదహారవ తేదీకి మారినట్లు తెలుస్తోంది.
         ఆగష్టు 16వ తేదీ గంట వైసీపీలోకి చేరడానికి ముహూర్తం పెట్టుకున్నారని తెలుస్తోంది.తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమక్షంలోనే గంటా శ్రీనివాస రావు వైసీపీ పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే,గంటా వర్గానికి చెందిన ఇతర రాజకీయ నాయకులు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకోవడానికి సిద్ధం అయ్యారని తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox