Breaking News

ఏపీ లో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..!

14 th Aug 2020, UTC
ఏపీ లో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..!

ఆంధ్రప్రదేశ్ : కరోనా మహమ్మారి కారణంగా టెన్త్, ఇంటర్ విద్యార్థులకు చివరి పరీక్షలు రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే, సెప్టెంబర్ నుంచి తిరిగి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని తొలుత నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, పేరెంట్స్ నుంచి విముఖత వస్తుండడంతో, అక్టోబర్ లో తిరిగి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు, ఎంసెట్, ఏపీసెట్ వంటి ప్రవేశ పరీక్షలకు షెడ్యూలుని విడుదల చేసారు. ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, సెప్టెంబర్ 17 నుంచి 25 తేదీల్లో పీఈసెట్, అక్టోబర్ 1న ఎడ్ సెట్, 2న లాసెట్ నిర్వహిస్తారు. ఇక తెలంగాణలో ఈనెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9,10,11,14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్ ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్ సెట్, ఐసెట్, పీఈసెట్ తేదీలను తరువాత ప్రకటిస్తామని తెలిపారు. పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్ స్లాట్స్ ను బట్టి ఈ తేదీలను ఖరారు చేస్తామని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox