Breaking News

ఒంగోలులో దారుణం. కరోనా శవాన్ని పీక్కు తింటున్న కుక్కలు..!

13 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ : కరోనా మహమ్మారి తీసుకు వచ్చిన తిప్పలు అన్ని ఇన్ని కావు. అయితే, కరోనా వస్తే, కుటుంబానికి దూరంగా క్వారంటైన్ లో ఉండాల్సి రావడం నరకంగా తోస్తూ ఉంటుంది. అయితే, క్వారంటైన్ కి భయపడి హోమ్ క్వారంటైన్లో ఉండడానికి కూడా కొన్ని చోట్ల అనుమతులు ఇవ్వకపోవడంతో తప్పనిసరిగా క్వారంటైన్ కి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
 
అయితే, క్వారంటైన్ సెంటర్లలో ఎక్కువగా పట్టించుకునేవారు లేకపోవడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరణించాక, వారి దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంలో అవక తవకలు జరుగుతుండడంతో క్వారంటైన్ కి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇలాంటి ఘటనలు పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, ఒంగోలు రిమ్స్‌ ఆవరణలో కరోనా మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్న ఘటన స్థానికుల హృదయాలను కలిచివేసింది. వివరాల్లోకెళితే, బిట్రగుంటకు చెందిన ఇత్తడి కాంతారావు (60) రెవెన్యూ శాఖలో వీఆర్‌ఏగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ నెల 5వ తేదీన గ్రామంలో కరోనా పరీక్షలు చేయించుకోగా, ఆయనకు పాజిటివ్ వచ్చింది. హోమ్ క్వారంటైన్ లో ఉంటానని అడుగగా, అధికారులు ఒప్పుకోలేదు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి క్వారంటైన్ కు తరలించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంతారావు ఒంగోలుకు వెళ్లారు.
 
అయితే, అక్కడకు వెళ్ళాక కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అనుమతులు  ఇవ్వలేదు. వైద్య సిబ్బంది మాత్రం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, తాము వైద్యులతో మాట్లాడుతూనే ఉన్నామంటూ సిబ్బంది భరోసా ఇస్తూనే ఉన్నారు. అయితే, అక్కడ ఏమి జరుగుతోందో కుటుంబసభ్యులకు తెలిసే అవకాశం లేకుండా పోయింది. అయితే, కొన్ని రోజులకు ఆసుపత్రి ఆవరణలో ఓ కరోనా రోగి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తింటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ మృతదేహం కాంతారావుది. ఈ ఘటన పై కుటుంబసభ్యులు లబోదిబోమంటున్నారు. వైద్య సిబ్బంది నమ్మించి మోసం చేసారని వాపోయారు. ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రి సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఈ ఘటన చూస్తే తెలుస్తోంది. ఈ విషయమై విచారణ జరపాలని టీడీపీ పార్టీ ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామి డిమాండ్ చేసారు. ఆయన ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించి విషయం ఆరా తీశారు. ఆ తరువాత స్వామి మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం 108లో ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన కాంతారావు అడ్మిట్‌ అయ్యారన్నారు. ఖాళీలు లేవంటూ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు బయటకు పంపారని తెలిపారు.వైద్య సిబ్బంది ఈ సమాధానం చెప్పడాన్ని ఎమ్మెల్యే స్వామి వ్యతిరేకించారు. ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి  సాయంతో, అడ్మిట్ అప్లికేషన్లను కూడా తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. రోగులకు కనీస వసతి సౌకర్యాలు లేవని ఆగ్రహించారు. కాంతారావు కుటుంబానికి రూ.కోటి ఆర్థికసాయం అందించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox