Breaking News

స్టే లు తెచ్చుకోకుండా పోరాడే దమ్ము టీడీపీకి లేదా..?

16 th Sep 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతోందని గత కొంతకాలంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ చేస్తున్న ఆరోపణలను కూడా ప్రతిపక్షాలు విమర్శించాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆరోపణలను రుజువు చేయాలంటూ వైసీపీకి ప్రతి సవాల్ విసిరింది. ఇపుడు వైసీపీ అన్నంత పని చేసింది. అమరావతి భూములపై జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని ఏసీబీ దర్యాప్తు కోరింది.

టీడీపీ సవాల్ చేసినట్లే, వైసీపీ పార్టీ ఈ అమరావతి భూముల వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ టీడీపీ ఇన్సైడర్ ట్రేడింగ్ కు పాల్పడినట్లు గుర్తించింది. కాగా, నిన్న మాజీ అడ్వొకేట్ జెనరల్ పై కేసు నమోదు అవడం టీడీపీ వర్గాల్లో కలకలం సృష్టించింది. అయితే, ఈ కేసులను వైసీపీ కుట్రపూరితంగానే చేస్తోందని తెలుగు దేశం పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి.

నిన్న మొన్నటి వరకు దమ్ముంటే రుజువు చేయాలనీ సవాల్ చేసిన టీడీపీ. నేడు విచారణలో రుజువై కేసు నమోదు అవ్వగానే వైసీపీ పై దుమ్మెత్తిపోస్తోంది. ఇది కక్ష సాధింపు చర్యగా మాట మార్చేస్తోంది. అంతే కాదు, దమ్ముంటే రుజువు చెయ్యి అని సవాల్ చేసిన టీడీపీ, నేడు రుజువులకు దొరకకుండా స్టేలు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. దమ్మాలపాటి శ్రీనివాస్ పై కేసు నమోదైన తరువాత విచారణ జరగకుండా  హై కోర్ట్ స్టే ఇవ్వడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. స్టేలు తెచ్చుకోకుండా పోరాడే దమ్ము టీడీపీ కి లేదా అంటే, సమాధానం టీడీపీ వర్గాల్లో ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ వ్యవహారం పై హై కోర్ట్ లో విచారణ జరగనుంది. ఈ విషయమై హై కోర్ట్ తీర్పు ఇచ్చేవరకు తదుపరి విచారణ కానీ, దర్యాప్తు గాని  చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ విషయమై హై కోర్ట్ ఏమి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox