Breaking News

ఇళ్లపట్టాలు ఆ స్థలాల్లో ఇవ్వొద్దు ..!

19 th Aug 2020, UTC
ఇళ్లపట్టాలు ఆ స్థలాల్లో ఇవ్వొద్దు ..!

ఆంధ్రప్రదేశ్  :సీఎం అయిన నాటినుండి జగన్ తనపై, తన పాలనపై సంక్షేమ ముద్ర వేయించుకోవడంలో సక్సెస్ అయ్యారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ప్రధానంగా దృష్టి పెట్టి వాటిపైనే ఎక్కువగా నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమమే తన ప్రధాన అజెండా అనే ముద్ర వేసుకున్నారు. ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ నిర్ణయం తీసుకున్నారు . అయితే ఇళ్ల పట్టాల విషయంలో కోర్టుల్లో కేసులు నడుస్తుండటం, అటు కరోనా ఉధృతి నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక, తాజాగా మరోమారు ఇళ్లపట్టాల విషయంలో కోర్టులో మరోమారు అడ్డంకి ఎదురైంది. ఇంకోవైపు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ, రూపాయి అప్పులేకుండా పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంటే, ఇళ్ల పట్టాల పేరిట సమకూర్చిన భూములన్నీ అధికార పార్టీకి చెందిన నేతలవే అని, వాటిని అధిక ధరలకు కొని, అందులోనూ అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అసలు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేనా? దీనిపై అధికార, ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారు? అన్న విషయాలపై ప్రైమ్9 స్పెషల్ హెడ్ లైన్ స్టోరీ.
 
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబంధించి - ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని రాష్ట్ర హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది యోగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాల్లో, ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి వీల్లేదని హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైసీపీ సర్కార్‌కు మరో పెద్ద షాక్ తగిలినట్టయింది. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

అలాగే ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీలో ఆగస్టు 15న ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఇళ్ల పట్టాల కేటాయింపులో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడం, విచారణ ఇంకా కొనసాగుతుండటంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఏపీలో మొత్తం 30 లక్షలమంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో రాజధాని అమరావతికి సంబంధించిన భూములు కూడా ఉన్నాయి. అలాగే, రాష్ట్రంలోని పలు వివాదాస్పద భూములు కూడా ఉన్నాయి. అమరావతి భూములు, ఇతర భూములకు సంబంధించి పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. అమరావతిలో భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా పంచాలన్న జగన్ సర్కారు నిర్ణయంపై అమరావతి రైతులు కోర్టుకు వెళ్లడంతో అక్కడ బ్రేక్ పడింది. హైకోర్టు నిర్ణయంపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ సర్కారుకు చుక్కెదురైంది.

ఇలాంటి సమస్యల నేపథ్యంలో ఇప్పటికీ ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. మొదట, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఇవ్వాలనుకున్నారు. అయితే, కోర్టు కేసుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవ్వాలని ప్లాన్ చేయగా, మళ్లీ వాయిదా పడింది. తాజాగా, అక్టోబర్ 2న గాంధీ జయంతి నాటికి ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే 8 వారాలపాటు తదుపరి విచారణ  వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

ఇళ్ల స్థలాల సేకరణలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారన్న పిటిషన్లపై హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ పిటిషన్లపై తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని సర్కారు ఆశిస్తోంది. ఇళ్ల స్థలాల పంపిణీకి చేపట్టిన భూసేకరణ అంశంలో ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టులో పలుమార్లు ఎదురుదెబ్బలు తగిలాయి. రాష్ట్రంలోని మైనింగ్ భూములపై కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుందని, వాటిని ఇతర అవసరాలకు వాడకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది.

రాష్ట్రంలో పలు చోట్ల మైనింగ్ భూములను ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కేటాయించారని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, వాటిపై స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలకు సంబంధించిన స్థలాలను ఇళ్ల పట్టాల కోసం ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది.
 
దివంగత సీఎం ఎన్టీఆర్ హయాంలో 1989లో తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి క్యాంపస్ కు 45 ఎకరాల భూమి కేటాయించారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం అందులో 20 ఎకరాలు తిరిగి తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాల కోసం తీసుకోవడం సరికాదని దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. యూనివర్సిటీకి చెందిన 20ఎకరాల భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించాలన్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న తెలుగు యూనివర్సిటీని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇంకా విభజించుకోలేదని, కాబట్టి ఆ స్థలాన్ని పంపిణీ చేయడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతోపాటు, విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు ప్రభుత్వం కేటాయించడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్ ను విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాష్ట్రంలో ఎక్కడా విద్యా సంస్థల భూములు ఇళ్ల పట్టాలకు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఇంకో వైపు, ఇళ్ళ పట్టాల విషయంలో ఇప్పట్లో తీర్పు వచ్చే అవకాశం లేదన్న అభిప్రాయాలూ ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.
 
అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో సవాల్ కి సిద్ధమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ భూములతో పాటుగా, కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు చేసిన ప్రయివేటు భూములను ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే చెరువులు, కుంటలు, ఆవ భూములతోపాటు మడ అడవులను సైతం ఇళ్లస్థలాల కోసం చదునుచేసి లే అవుట్‌లు వేశారు. దీనిపై ఇప్పటికే చాలా ఫిర్యాదులు వెళ్ళాయి. కాకినాడకు చెందిన కొందరు వ్యక్తులు కూడా దీనిపై కోర్ట్ కి వెళ్ళే అవకాశం ఉంది. అయితే మడ అడవులు అన్నవి చాలా కీలకం. అవి అరుదైనవి కూడా.  సునామీలు వచ్చిన సమయంలో ప్రజలను కాపాడేది ఆ అడవులే. 2004 సునామీ సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో మడ అడవులు కీలకంగా వ్యవహరించాయి. ఇప్పుడు వాటిని చదును చేసారు . దీనిపై కేంద్ర పర్యాటక శాఖతో పాటుగా, కేంద్ర విపత్తుల నిర్వహణ శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఫోటోలు, వీడియోలు సేకరించారు. మడ అడవులను ఇళ్లపట్టాలకు కేటాయించడంపై  ఫిర్యాదులు కూడా నమోదు చేసారు. కోర్టుల విషయం పక్కన పెట్టి, ఇప్పుడు కేంద్రం దీనిపై ముందుకు వెళ్లి, చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. దీంతో, ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేనా అన్నసందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇక, కోర్టు తీర్పులపై అధికార పార్ట్ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు తయ్యారు చేయవని అంటున్నారు.

పేదలకు ఇళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టులు స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇళ్ల స్థలాల అంశంలో కోర్టులు వెంటనే ఓ నిర్ణయం తీసుకోవాలని ,అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చంద్రబాబు ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్నింటి కంటే ప్రధానమైన అంశం ఇళ్ల పట్టాల పంపిణీ. గతంలో ఇందిరమ్మ గృహాలు, రాజీవ్ గృహకల్ప, ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో ప్రభుత్వాలు పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చినా, వాటితో లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. ఊరికి దూరంగా కట్టిన ఇళ్లు సగానికి సగం నిరుపయోగంగా మారాయి. ఇక టీడీపీ హయాంలో షేర్ వాల్ టెక్నాలజీ పేరుతో నాసిరకం ఇళ్లు కట్టి పేదలను దారుణంగా మోసం చేశారన్న ఆరోపణలు వచ్చాయి.

ఇలాంటి వ్యవహారాలతో ప్రభుత్వం కట్టిచ్చే ఇళ్లంటేనే పేదలు భయపడే పరిస్థితి వచ్చింది. ఆ డబ్బులేవో మాకే ఇస్తే మేమే కట్టుకుంటాం కదా అనే పరిస్థితులున్నాయిప్పుడు. తన సుదీర్ఘ పాదయాత్రలో పేదల కష్టాలను అంచనా వేసిన జగన్ ఇళ్ల పట్టాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా వారికి స్థలం కేటాయించి, ఆ తర్వాత ఇళ్లు కట్టుకోడానికి ఆర్థిక భరోసా కల్పించబోతున్నారు.

గ్రామాల్లో ఒకటిన్నర సెంటు, పట్టణాల్లో సెంటు భూమిని పేదలకు కేటాయిస్తున్నారు. అసైన్ మెంట్ స్థలాలలో ఇల్లు కట్టకుండా రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారని, వాటిపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో హక్కులు ఎలా బదలాయిస్తారని పలు అడ్డంకులు ఎదురయ్యాయి.  ప్రభుత్వ స్థలాలు పోను 20వేల కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపు 62వేల ఎకరాలు సమీకరించింది ప్రభుత్వం.
చట్టప్రకారం ఇది కాస్త క్లిష్టమైన విషయమే అయినా, ప్రభుత్వం మాత్రం కోర్టుల నుంచి అనూకుల తీర్పు కోసం ఎదురు చూస్తోంది.

కోర్టుల ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సేకరించిన భూముల శాతం తరిగిపోతూ వస్తోంది. సర్కార్ 30 లక్షల మందికి పట్టాల పంపిణీ కోసం 26,000 ఎకరాల భూమిని సేకరించే లక్ష్యం పెట్టుకుంది.  అందుకే ఎక్కడ ఖాళీగా ప్రభుత్వ భూములు కనిపిస్తే వాటిని పంపిణీకి సేకరించి పెట్టుకుంది. అలా సేకరించిన భూముల్లోనే మైనింగ్ భూములు, పాఠశాల భూములు ఉన్నాయి. పేదలకు భూములు పంచాలని అనుకోవడం వెనకున్న అసలు కారణం ప్రతి ఒక్కరికీ  సొంత ఇంటి కలను నెరవేర్చడమేనని ప్రభుత్వం అంటోంది.  అలాంటి గొప్ప లక్ష్యాన్ని కొందరు దుర్మార్గులు కోర్టుల ద్వారా ఆపుతున్నారని అంటూ పరోక్షంగా చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేశారు వైసీపీ నేతలు. నిజంగా పేదల కోసమే వైసీపీ ప్రభుత్వం ఉచిత స్థలాల పంపిణీ చేస్తామంటే ఎవరూ  కాదనరని, కానీ ఆ పేరుతో ఖాళీగా ఉన్న భూములను, ఇతర అవసరాల కోసం కేటాయించబడిన భూములను వాడుకుంటామంటేనే ఇలా చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తమవుతాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
 
పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం ముఖ్యమే. కానీ సమాజంలోని ఇతర అవసరాలు కూడా ముఖ్యమే కదా.  మరి ఒక అవసరానికి కేటాయించిన భూములను ఇతర అవసరానికి వాడటమే ఆమోదయోగ్యం కాదు అన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. పేదల పంపిణీ కోసం భూములు కావాలంటే, అన్యాక్రాంతంగా ఉన్న ప్రభుత్వ భూములు చాలానే ఉన్నాయి. అలాగే కబ్జా కోరల్లో కూడా చాలా భూమి ఉంది. దాన్ని స్వాధీనపరుచుకుని పట్టాలు ఇవ్వొచ్చు. కానీ , ఇతర ప్రజా అవసరాల కోసం ముఖ్యంగా విద్యా సంస్థల కోసం కేటాయించబడిన భూమిని ఇవ్వడం మంచి పద్దతి కాదంటోంది టీడీపీ. అలా చేసుకుంటూ పోతే ఈరోజు పాఠశాల భూములు, రేపు ఆసుపత్రి భూములు ఇలా అందుబాటులో ఉన్న ప్రతి భూమిని ఇతర అవసరాల కోసం వాడేసుకోవడం అలవాటుగా మారిపోతుంది. దీన్నే కోర్టు తప్పుబట్టింది. కానీ మొదటి నుండి కోర్టు తీర్పులను తప్పుబడుతున్న ప్రభుత్వం, ఈ తీర్పును కూడా తప్పుబట్టే అవకాశం లేకపోలేదంటున్నారు. పేదలకు మంచి చేస్తాం అంటే కోర్టులు అడ్డుపడుతున్నాయని ఇప్పటికే  నారాయణస్వామి లాంటి నేతలు ఆరోపించారు. అలా చేస్తే అది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ అవుతుంది.  అప్పుడు హైకోర్టు దాని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.  కాబట్టి ప్రభుత్వం చేసే మంచి పనిని సక్రమమైన రీతిలో, చట్ట ప్రకారం చేస్తే ఎవరూ అడ్డుతగలలేరు. కానీ, అలా కాకుండా పంచి పెట్టాలి, పేరు తెచ్చుకోవాలి అనే తొందరలో చట్టాలను సైతం లెక్కచేయకుండా ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్తామంటే మాత్రం స్వయంగా తమ పనులకు తామే అడ్డుకట్ట వేసుకున్నట్టు అవుతుందని, పైపెచ్చు సంక్షేమ పథకాల వాయిదాలతో ప్రజల్లో చులకన  అవుతారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది .  

ఇక, పంపిణీకి సిద్ధంగా ఉన్న భూముల విశేషాలు. గతంలో వాటిపై వచ్చిన ఆరోపణలను ఒకసారి చూస్తే ....

ఇళ్ల పట్టాలకు సంబంధించి, భూసేకరణ కోసం 6,500 కోట్లు, విద్యుదీక‌ర‌ణ, మౌలిక స‌దుపాయాల కోసం  6,400 కోట్లు ఖ‌ర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇక ,ఇళ్ల స్థలాలతోపాటే, పేదలకు ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి  2.5 ల‌క్ష‌ల రూపాయల చొప్పున మొత్తం 75వేల కోట్ల రూపాయలను ఖ‌ర్చు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అటు 16 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలకు లే ఔట్స్ కూడా సిద్ధం చేశామన్నారు. కాగా, మహిళల పేరు మీదనే ఇళ్ళ స్థలాలను ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు తెలుస్తోంది. అలాగే జాబితాలో పేర్లు లేనివారు గ్రామ/ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చునని, దీని కోసం ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
 
అయితే పేదలకు ఇస్తున్న ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి అనుమతితో పాటుగా ఆ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టుకోవడం, ఐదేళ్ల తరువాత అమ్ముకోవడానికి వీలు కల్పిస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకు నుంచి స్థలం ద్వారా ఋణం పొందొచ్చు. ఒకవేళ ఇల్లు కట్టుకొని ఐదేళ్ల తరువాత వాటిని అమ్ముకోవాలి అనిపిస్తే, అమ్ముకొనే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో పనులు కొనసాగాలని, డిజైన్‌లో భాగంగా పడక గది, వంట గది, లివింగ్‌ రూం, మరుగుదొడ్డి, వరండా సహా సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఇళ్ల పట్టాల విషయంలో జగన్, గతంలో ఏమన్నారో ఇప్పుడోసారి చూద్దాం.

ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం  పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతోందంటూ ప్రతిపక్ష టీడీపీ ఎప్పటినుండో ఆరోపిస్తోంది. ఇళ్ల స్థలాల కోసం స్థానిక వైసీపీ నేతల భూములను అధిక ధరలకు కొంటూ అవినీతికి పాల్పడుతూ, మరో వైపు ఇళ్ల స్థలాలు ఇస్తామని పేదల నుంచి  వైసీపీ నేతలు కోట్ల రూపాయలు కమిషన్ లు దండుకుంటున్నారని పసుపు నేతలు ఆరోపించారు. ఇప్పటికే  ఇళ్ల స్థలాల కోసం  ప్రభుత్వానికి భూములిచ్చిన రైతుల నుంచి 1,400 కోట్లు కమీషన్లు వసూలు చేశారని, ఇళ్ల స్థలాలు ఇస్తామని పేదల నుంచి మరో  200 కోట్లు వసూలు చేశారని, ఇప్పటికే మొత్తం 1600 కోట్ల అవినీతి  జరిగిందని విమర్శలు చేస్తున్నారు.

రైతుల దగ్గర నుంచి వైసీపీ నేతలు కొనుగోలు చేసిన భూములను ప్రభుత్వం నాలుగు రెట్లు అధిక ధర ఇచ్చి కొనాల్సిన అవసరం ఏంటి?  అని ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల స్థలాల పధకం ప్రక్రియ ప్రారంభంకు ముందు రాష్ర్ట వ్యాప్తంగా జరిగిన భూ అమ్మకం, కొనుగోళ్లపై  ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా కోరుతున్నారు. ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసే భూములన్నీ స్ధానిక వైసీపీ నేతలవే అని, మార్కెట్ ధర కంటే అధికంగా పెంచి, ఎకరం 5 లక్షలు విలువ చేయని భూమిని  45 లక్షల నుంచి  75 లక్షలకు కొంటున్నారని పలువురు టీడీపీ నేతలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో 10 వేలు ఇచ్చిన వారికి శ్మశానాల్లో,  30 వేలు ఇచ్చిన వారికి చెరువుల్లో, 60 వేల నుంచి లక్ష ఇచ్చిన వారికి ఊరికి దగ్గరల్లో  ఇళ్ల స్ధలాలు కేటాయిస్తున్నారన్న వార్తలు సైతం వినిపించాయి. అసలు ఇళ్ల స్థలాల విషయంలో అనేక రకాలుగా అవినీతి జరిగిందని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.  

ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కలు అనేకం ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వం ఎవరికైనా DKT పట్టాలు, బీఫాం రూపంలోనే స్థలాలిస్తారు. అంటే, అనుభవించాడనికే కానీ అమ్ముకునే అవకాశం లేదు. అమ్ముకునే అవకాశం ఇవ్వడం చట్ట విరుద్ధం కూడా. అయితే ఈ చట్టాలను పట్టించుకోకుండా,  తాము ఇచ్చే స్థలాలను అమ్మేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టి వేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ప్రభుత్వానికి చట్ట నిబంధనలపై స్పష్టమైన అవగాహన ఉన్నా, న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసినా, ముహుర్తాలు ఖరారు చేసి, పంపిణీ చేయలేక చేతులెత్తేస్తోంది. సుప్రీంకోర్టులో అయినా, ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం లేదని, డీకేటీ పట్టాల రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా మొండి పట్టుదలతో ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, అన్ని అడ్డంకులు తొలగిపోయి, చట్టపరమైన నిబంధనలతో ఇల్లు లేని పేదవారికి తక్షణమే ఇంటి స్థలాలు అందాలని మనమూ కోరుకుందాం. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox