ఏపీ సీఎం జగన్ బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగితే వారికి పార్టీ కండువా.. లేదంటే జైలు అన్నట్టు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగానికి జగనే బాధ్యత వహించాలన్నారు.
నిన్న అచ్చెన్న.. నేడు జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిల అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య. బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగితే మీ పార్టీ కండువా.. లేదంటే జైలు.. రాష్ట్రంలో అమలుచేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగానికి జగనే బాధ్యత వహించాలి అని దేవినేని ఉమ ట్వీట్లో పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కార్మిక శాఖా మంత్రిగా వున్నపుడు ఈ ఎస్ ఐ ఆసుపత్రులకు నిభందనలకు విరుద్దంగా మందులు, ఇతర ఉపకరణాలు కొనుగోలు చేసారని శుక్రవారం అరెస్ట్ చేసారు. శనివారంఉదయమే అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర రెడ్డిని లారీల అమ్మకాలు, ఇన్సూరెన్స్ లకు సంభందించి అవకతవకలకు పాల్పడ్డారని అరెస్ట్ చేసారు.
అయితే ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దారాఘవరావుకు రెండు రోజుల కిందట సీఎం జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాఘవరావుకు చెందిన వ్యాపారాలపై పన్నులు వేసి వత్తిడి చేసి పార్టీలో చేరే విధంగా చేసారని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వీటిని దృష్టిలో వుంచుకునే దేవి నేని ఉమ పై విధంగా ట్వీట్ చేసారు.
నిన్న అచ్చెన్న,నేడు జెసి ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి ల అరెస్ట్ రాజకీయకక్ష సాధింపుచర్య. బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగితే మీ పార్టీ కండువా.లేదంటే జైలు.. రాష్ట్రంలో అమలుచేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగానికి @ysjagan బాధ్యత వహించాలి #TDPWithJCFamily pic.twitter.com/2HqRv1oJ41
— Devineni Uma (@DevineniUma) June 13, 2020

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
26 Jan 2021
27 Jan 2021
27 Jan 2021