ఆంధ్రప్రదేశ్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిజిపి లేఖ....
మీరు ఈ రోజు ప్రధానమంత్రి గారికి రాసిన లేఖలో పేర్కొన్న ఫోన్ టాపింగ్ వంటి పలు అంశాలకు సంబంధించి మీ వద్ద ఉన్న ఎటువంటి సాక్ష్యాధారాలలైన ఉంటే మాకు అందజేయగలరని కోరుతున్నాను. రాష్ట్రంలోని పౌరులకు రక్షణ కల్పించడం, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు మేము ఎల్లవేళలా అన్ని విధాలుగా దృడ సంకల్పంతో ఉన్నామని తమరికి తెలియజేస్తున్నాను. మాకు పూర్తిస్థాయిలో సహకరించి పౌరుల హక్కులను కాపాడేందుకు, రూల్ ఆఫ్ లా ను అమలు పరచేందుకు సహకరించగలరని కోరుతున్నాను.