Breaking News

న్యాయస్థానాలను, ఆలయాలను ఒకేలా చూడాలి.. ఎంపీ రఘురామ కృష్ణంరాజు

23 rd Sep 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :వైసీపీ నేతలు ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ శ్రేణులు తనను పిచ్చికుక్క అని మాట్లాడుతున్నారని, తోలు తీస్తామని, చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. తన బాగోతాలను బయటపెడితే వారి బాగోతాలే బయటపడుతాయన్నారు.  బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎవరి బొమ్మతో గెలవలేదని.. తన బొమ్మతోనే గెలిచాని, తన రక్తం తాగిన పార్టీ.. రక్తం తిరిగి ఇస్తుందా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

తన సెక్యూరిటీని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారు అలాగే మాట్లాడితే తన భద్రత రెట్టింపు అవుతుందన్నారు. హిందువులు అంటే జగన్‌కు గౌరవం ఉంటే, తిరుమలలో సంతకం పెట్టాకే దర్శనానికి వెళ్లాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. ముఖ్యమంత్రికి స్వరూపానంద హితోపదేశం చేయాలన్నారు. హిందువు రక్షకుడిగా ఉంటాడనుకున్న సీఎం కక్షకుడిగా మారారని రఘురామ ఎద్దేవా చేశారు. న్యాయస్థానాలను, ఆలయాలను ఒకేలా చూడాలని, దేవుడికి గౌరవం ఇచ్చినట్లే, జడ్జిలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. న్యాయస్థానాలకు గౌరవం ఇవ్వాలని ఎవరైనా చెబుతారని రఘురామ వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఆయన చాణక్యుడు రాసిన సూక్తులను మీడియాకు చదివి వినిపించారు. పంది బలిసినంత మాత్రాన సింహం కాలేదని తదితర సూక్తులను చదివి  ఇవి ఎవరినో దృష్టిలో పెట్టుకుని చెబుతున్నవి కావని స్ఫష్టం చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox