Breaking News

మాణిక్యాలరావు మృతి పై స్పందించిన చిరంజీవి..!

01 st Aug 2020, UTC

హైదరాబాద్ : మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనా మహమ్మారి కారణం గా మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. గత నెలలో పాజిటివ్ గా తేలడం తో ఆయన ఆసుపత్రి లో ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.. ఆయన చికిత్స పొందుతుండగానే కన్ను మూసారు. ఆయన మృతి పై పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
            తాజాగా ఆయన మృతి పై టాలీవుడ్ స్టార్ హీరో చిరంజీవి స్పందించారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనాతో మృతి చెందారన్న వార్త తెలిసి విషాదానికి లోనయ్యానని చెప్పారు. ఆయన ఎంతో మంచి మనిషి అని,ఓ సామాన్యుడి గా రాజకీయాల లోకి వచ్చి  ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగారని చెప్పారు. ఆయన ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే.. ఆయన కుటుంబ సభ్యులకు చిరు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox