Breaking News

హీరో రామ్‌ కు చంద్రబాబు మద్దతు

17 th Aug 2020, UTC
 హీరో రామ్‌ కు చంద్రబాబు మద్దతు
 
టాలీవుడ్ :హీరో రామ్‌పై విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబుఖండించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాలరాయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని ఒక ప్రకటన విడుదల చేశారు. ట్వీట్ పెట్టడమే విచారణకు అడ్డుపడటంగా భావించి నోటీసులు ఇస్తామని బెదిరించడంపై మండిపడ్డారు.రాష్ట్రంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఏవిధంగా కాలరాస్తున్నారో అనడానికి ఇది మరో రుజువని, రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నారు అన్నారు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని, ప్రశ్నించే గొంతును అణిచేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా చంద్రబాబు అభివర్ణించారు.
 
విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద దుర్ఘటనకు సంబంధించి విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారికైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని ఏసీపీ సూర్యచంద్రరావు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఏసీపీ సూర్యచంద్రరావు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ‘‘స్వర్ణప్యాలెస్ దుర్ఘటనలో రమేష్ ఆసుపత్రి యాజమాన్య వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. ఇప్పటి వరకు డాక్టర్లు మమత, సౌజన్యను విచారించాం. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులు జారీ చేస్తాంఅని హెచ్చరించారు.
 
ట్వీట్లు, ఆడియో టేపులు పంపటం మాని ఆధారాలు ఉంటే విచారణకు హాజరు కావాలని హీరో రామ్‌తో పాటు డాక్టర్ రమేష్‌కు ఏసీపీ సూర్యచంద్రరావు సూచించారు . దీనిపై స్పందించిన హీరో రామ్ తనకు న్యాయం పై నమ్మకం వుందని ఇకపై తాను ట్వీట్లు చేయనని తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox