ఆంధ్రప్రదేశ్ :గతంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న చంద్రబాబు సర్కారు కేంద్రం నిధులతో సోకులు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
సోము వీర్రాజు విమర్శించారు. శుక్రవారం విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోర్టులు నిర్మించాలని నిధులు విడుదల చేసినప్పటికీ చంద్రబాబు పనులు చేపట్టలేదని ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. పోర్టులు నిర్మించకపోవడం వల్లే మత్య్సకారులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారని, రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సాగర తీరంలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
విద్యుత్ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులను టీడీపీ నేతలు అమ్ముకున్నారని మండిపడ్డారు. ఆయనేమన్నారంటే, టీడీపీ హయాంలో చంద్రన్నబాట పేరుతో వేసిన రోడ్లు బీజీపీ ప్రభుత్వం మంజూరు చేసినవేనన్నారు.కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా సంస్థలను పూర్తి భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే, అదీ దశల వారీగా ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని వార్తలు చదవండి.