Breaking News

వర్షాకాలం నాటికి అందుబాటులో 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక:సీఎం జగన్A

09 th Jun 2020, UTC
వర్షాకాలం నాటికి అందుబాటులో  70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక:సీఎం జగన్A

స్పందన కార్యక్రమంపై ఏపీ  సీఎం జగన్‌ మంగళవారం అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇసుక రీచ్‌లను తెరవాలని అధికారులను ఆదేశించారు. జూన్ చివరి నాటికి రోజుకు 3లక్షల టన్నుల ఇసుక నిల్వ లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అదే విధంగా వర్షాలు కురిసే నాటికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని.. కొత్త వనరులను గుర్తించి మరిన్ని ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్నవాళ్లు.. ఎడ్లబండ్ల ద్వారా 5 కి.మీ పరిధిలో ఇసుక తెచ్చుకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. గ్రామ సచివాలయంలో ఇందుకు సంబంధించి అనుమతులు తీసుకోవచ్చని వెల్లడించారు‘గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ చేసుకోవచ్చు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షించాలి. బల్క్ బుకింగ్ అనుమతులు జాయింట్ కలెక్టర్ చూసుకోవాలి అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

రెండు వారాల క్రితం 35 లక్షల మంది ఉపాధి హామీ పనులకు వచ్చేవారన్న సీఎం జగన్‌.. ఇప్పుడు ఆ సంఖ్య 54.5 లక్షలకు చేరిందని హర్షం వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో పనులు కల్పిస్తున్నందుకు కలెక్టర్లకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి 60లక్షల మందికి పనులు కల్పించాలని ఆదేశించారు. అదే విధంగా... 55వేల అంగన్‌వాడీల్లో 31 వేల చోట్ల కొత్త బిల్డింగ్‌లు కట్టాలని.. అంగన్‌వాడీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  పట్టణ, నగరాల్లో వైఎస్సార్ క్లినిక్స్ మ్యాపింగ్ చేయనున్నామని  

 వీటి స్థలాలు గుర్తించే పనిని యుద్ధప్రాతిపదికన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా.. నాడు-నేడు కార్యక్రమంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు.స్కూళ్లలో నాడు-నేడు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్‌ పర్యవేక్షించాలి. 15 కొత్త మెడికల్ కాలేజీలను కట్టబోతున్నాం. ఒక్కో మెడికల్ కాలేజీకి 50 ఎకరాల స్థలం కావాలి. కొత్త మెడికల్ కాలేజీలకు అవసరమైన స్థలాలను గుర్తించాలని ఆదేశించారు.కరోనా పై ఆస్పత్రుల సన్నద్ధతను కలెక్టర్లు పర్యవేక్షించాలని, ఐసోలేషన్ సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్‌ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందిస్తామని సీఎం  వెల్లడించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox