Breaking News

త్వరలో సీఎం జగన్ గ్రామాల పర్యటన..!

12 th Jun 2020, UTC
త్వరలో సీఎం జగన్ గ్రామాల పర్యటన..!

ఏపీ సీఎం జగన్  త్వరలో గ్రామాల్లో పర్యటించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్షేమ పథకాలను గ్రామస్థాయిల్లో అమలు చేసేందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అర్హులకు పథకాలు అందకపోతే అధికారులను బాధ్యలను చేస్తానని జగన్ హెచ్చరించారు. అర్హులందరికీ పెన్షన్‌, ఆరోగ్య శ్రీ, ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్ ఆదేశించారు.

గురువారం గ్రామ, వార్డు సచివాలయాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. పారదర్శకత, అవినీతి, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలన్నారు. మనకు ఓటేయకపోయినా అర్హత ఉన్నవారికి పథకాలు అందాలని, ప్రకటించిన సమయంలోగా సకాలంలో పథకాలు అందాలని ఆదేశించారు. ఎవరి దరఖాస్తులను కూడా తిరస్కరించకూడదని, అర్హత ఉన్న వారికి పథకాలు అందకపోతే... అధికారులే బాధ్యులని హెచ్చరించారు.



పెన్షన్, ఇళ్లపట్టాలు, ఆరోగ్యశ్రీకార్డులు, రేషన్‌ కార్డులు తప్పనిసరిగా అర్హులకు అందాలన్నారు. మొదట వీటిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆగస్టునుంచి గ్రామాల్లో పర్యటనకు సిద్ధమవుతున్నామని, పథకాలు అందలేదని ఎలాంటి ఫిర్యాదులు రావొద్దని జగన్ చెప్పారు.

గ్రామ స్దాయిలో పేదలకు ప్రభుత్వ పధకాలు, సంక్షేమ పధకాలు అందించడాని గ్రామ సచివాలయాలను నెలకొల్పి వాటిలో అవసరమైన ఉద్యోగులను నియమించారు. ప్రతీ ఇంటిలోనూ అవసరమైన లబ్దిదారులను గుర్తించడానికి మూడు లక్షల మంది వాలంటీర్లను నియమించారు. ఇపుడు గ్రామాల పర్యటనలో ఈ యంత్రాంగం ఎంత జవాబుదారీ తనంతో పనిచేస్తోందో అంచనా వేయడానికి అవకాశం చిక్కుతుందని అదికార వర్గాలు అంటున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox