Breaking News

ట్విట్టర్ లో విజయసాయిx అయ్యన్న..!

07 th Jul 2020, UTC
ట్విట్టర్ లో విజయసాయిx అయ్యన్న..!

తన దైనశైలిలో టీడీపీ పైన, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పైన ట్విట్టర్ లో సెటైర్లు వేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి అలవాటు. అదే విధంగా పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే టీడీపీ రాజకీయం చేస్తుందంటూ ఆయన ట్వీట్ చేసారు. దీనికి టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.

విజయసాయి తన ట్వీట్‌లో ‘జగన్ గారి ప్రభుత్వం పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తుంటే నిరసనలకు పిలుపునిచ్చాడు ఒక గుడ్డి విజనరీ. హైదరాబాద్లో ఉంటూ జూమ్ యాప్ ద్వారా కుట్రలు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం. ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లడం. ఇంకెంత దిగజారతావు బాబూ? 2024లో నీ అడ్రస్ గల్లంతే’అంటూ చంద్రబాబును టార్గెట్ చేశారు.

  ఇళ్ల స్థలాల పంపిణీ వాయిదాపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. వైఎస్ఆర్ ఇళ్ల పట్టాల అమ్మకం కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేసాడు సైకో ప్రిజనరీ. సహజీవనం అన్న మేధావి ఇప్పుడు కరోనా కారణంగా ఇళ్ల పట్టాలు అమ్మకం వాయిదా పడింది అనడం విడ్డురంగా ఉంది. పట్టాలు అమ్మకం, డబుల్ రేటుకి స్థలాలు కొనడం. అధికార పార్టీ వాళ్లే చెత్త పాలన అంటూ వేరే కుంపటి పెడుతున్నా ప్రిజనరీ దిగజరుతూనే ఉన్నాడు అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు.

మరో వైపు పేదలకు ఇళ్లల స్థలాల కేటాయింపులు అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. టీడీపీ హయాంలో 25లక్షల ఇళ్లు మొదలుపెట్టి 10లక్షలు పూర్తి చేశాం. 6లక్షల గృహాల్లోకి లబ్ధిదారులెళ్లారు. ఏడాదికి 5లక్షల ఇళ్ళు ఇస్తామని చెప్పి, "సెంటుపట్టా" పేరుతో  భూముల కొనుగోలు, స్థలాల చదును, పట్టాలలో మీపార్టీ నాయకులు చేసే అవినీతి, దోపిడీపై విచారణకు ఆదేశించే ధైర్యం మీకుందా? సీఎం జగన్‌ గారు అంటూ దేవినేని ట్వీట్ చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox