Breaking News

ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో సడలింపులు..!

01 st Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ : నిన్నటితో అన్ లాక్ రెండవ దశ పూర్తయిన సంగతి తెలిసిందే. తాజాగా నేటి నుంచి మూడవ దశ నిబంధనలు అమలు కానున్నాయి. ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సడలింపులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 నిబంధనల ప్రకారం ఏపీ సరిహద్దు వద్ద చెక్ పోస్టుల్లో సడలింపులు ఇచ్చారు. అయితే ఇపుడు కూడా ఏపీకి వచ్చే వారు స్పందన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక ఆటోమాటిక్ గా ఈ పాస్ మొబైల్, ఈ మెయిల్ కి వస్తుంది. దానిని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చు.
              అయితే కేవలం ఎవరు వచ్చారో గుర్తించేందుకు మాత్రమే ఈ నిబంధన కొనసాగుతున్నది. ఆ తర్వాత ఆరోగ్య కార్యకర్తలు వారి ఆరోగ్యంపై దృష్టి ఉంచుతారు. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కమ్యూనికేట్ చేయడం కోసం స్పందన ఆప్ లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. రేపటి నుంచి ఈ విధానం అమలు లోకి రానుంది. ఈ విషయాలను ఏంటీ కృష్ణబాబు, ప్రిన్సిపాల్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్ అండ్ బి తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox