Breaking News

మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటికి మరో ఉచ్చు...!

26 th Sep 2020, UTC

గుంటూరు :మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి పై తాజాగా మరో చీటింగ్ కేసు నమోదు అయింది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం ఆయనపై అమరావతి భూములకు సంబంధించి ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఆయన హై కోర్ట్ లో ఓ పిటిషన్ వేశారు. దీనిని విచారణ చేసిన హై కోర్ట్ గాగ్ ఆర్డర్ వేసింది. దీనితో అమరావతి భూములకు సంబంధించి విచారణ తాలూకు వివరాలు బయటకు వెల్లడి అయ్యే అవకాశం లేదు.

ఇది ఇలా ఉంటె ఆయనపై మరో చీటింగ్ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా రిటైర్డ్ లెక్చరర్ కోడె రాజారామ్మోహన రావు పోలీసులుకు ఓ ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదు ప్రకారం. విశ్వాసఘాతుకం, నేరపూరిత కుట్ర కింద ఆయనపై పోలీస్ లు కేసు నమోదు చేసారు. అయితే ఈ కేసులో దమ్మాలపాటి శ్రీనివాస రావు బావమరిది కాపిటల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి నన్నపనేని సీతారామరాజు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అడుసుమిల్లి తనూజ, దమ్మాలపాటి నాగరాణి, పొట్లూరి అనంత లక్ష్మితో సహా ఇతరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే మంగళగిరి పోలీస్ లు కూడా ఈ కేసు నమోదు అయినట్లు ధృవీకరించారు.

దమ్మాలపాటి శ్రీనివాస్ కుటుంబంతో భాగస్వామ్యం పంచుకుని సీఆర్డిఏ పరిధిలోగుంటూరు జిల్లా కృష్ణాయ పాలెం లేక్ వ్యూ పేరుతొ  కాపిటల్ హౌసింగ్ కంపెనీ అపార్ట్మెంట్ లు నిర్మిస్తోంది. అయితే తన వద్ద రెండు ప్లాటులకు సరిపడా డబ్బు తీసుకుని ఒక అపార్ట్మెంట్ ను మాత్రమే తన పేరు మీద రిజిస్టర్ చేసారని రాజరామమోహన్రావు కంప్లైంట్ చేసారు. అంతే కాదు. ఈ లేక్ వ్యూ అపార్ట్మెంట్ పక్కనే స్టార్ హోటల్స్ వస్తున్నాయి అని చెప్పి మరో 75 లక్షలు కూడా తీసుకున్నారట. దమ్మాలపాటి శ్రీనివాస్ ఏజీ గా ఉన్నారు కాబట్టి ఈ రహస్యాలన్నీ ముందే తెలుసనీ చెప్పారట. ఇపుడు వారిని అడిగితె జైలులో పెడతామని బెదిరిస్తున్నారు అని సదరు రాజారామమోహనరావు కేసు పెట్టారు. ఈ మేరకు పోలీస్ లు కేసు నమోదు చేసుకున్నారు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox