Breaking News

బెస్ట్ సీఎంగా జగన్ సీ ఓటర్ సర్వేలో నాల్గవస్దానం..!

03 rd Jun 2020, UTC
బెస్ట్ సీఎంగా జగన్ సీ ఓటర్ సర్వేలో నాల్గవస్దానం..!

జనరంజకంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌ నాలుగో స్థానంతో సీనియర్ల సరసన నిలిచారు. వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు పట్ల దేశవ్యాప్తంగా 65.69 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై 62 శాతం సంతృప్తి వ్యక్తమైంది. ప్రధాని మోదీ పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో ఒడిశా (95.6 శాతం) ముందు వరుసలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో 83.6 శాతం సంతృప్తి వ్యక్తమైంది.
దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ప్రథమ స్థానం దక్కింది. ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ భగేల్‌    మిగతా  రెండో స్థానంలోనూ, కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ మూడో స్థానంలోనూ నిలిచారు. ‘సీ ఓటర్‌–ఐఏఎన్‌ఎస్‌’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా మే నెల చివరివారంలో నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
 72.56 శాతం మంది ప్రజల మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే ఐదో స్థానంలోనూ, 74.18  శాతం మంది మద్దతుతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ 6వ స్థానంలోనూ నిలిచారు.
 54.26 శాతం మంది ప్రజల మద్దతుతో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు 16వ స్థానంలో నిలిచారు.

‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా డాట్‌కామ్‌’ మంగళవారం ఈ వివరాలను ప్రముఖంగా ప్రచురించింది. ప్రజాదరణ చూరగొన్న ముఖ్యమంత్రుల్లో తొలి మూడు స్థానాలు పొందిన వారిలో ఇద్దరు  సీనియర్ల సరసన  జగన్ నిలవడం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox