Breaking News

అమరావతి వలన 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల సంపద వచ్చేది : చంద్రబాబునాయుడు

15 th Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ : అమరావతి 5 కోట్ల ప్రజల కలల రాజధాని అని, 2 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ప్రాంతమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిని కొనసాగించి ఉంటే రాష్ట్రం బాగుపడేది. అనాగరిక చర్యలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అమరావతి తరలింపు దుర్మార్గమైన ఆలోచన అని ఆరోపించారు. కోవిడ్ నిర్లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రాన్ని నాశనం చేశారు. అమరావతి తరలింపుతో మరింత దిగజార్చుతున్నారు. ఓటేసింది ప్రజల కష్టాలు తీర్చటానికా?లేక కష్టాల్లోకి నెట్టడానికా? ఆ రోజు ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు. పదే పదే నమ్మించి మోసం చేశారుఅంటూ ఆయన వైసీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు.

అమరావతి భవనాలు అమ్మటానికి మీరెవరు? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నిలదీశారు. అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ కానే కాదు. ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి. అన్ని జిల్లాలకు సమదూరం అమరావతి. సంపద సృష్టి కేంద్రం అమరావతి. స్వయం ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతి. రైతులకు పరిహారం ఎవరు చెల్లిస్తారు. ఇవన్నీ ఆమోదయోగ్యం కానేకాదు. 

ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయి. ప్రతిపక్ష నేతగా జగన్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 50 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు రాజధానిగా ఆమోదం తెలిపిన ప్రాంతం అమరావతి. అన్ని విధాలా అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతం కూడా. చెన్నై, బెంగుళూరుకు నీటి సమస్య ఉంది. అమరావతికి ఆ కొరత లేదు. 5 జాతీయ రహదారుల్ని కలిపే ప్రాంతం అమరావతి. నవ నగరాలు అమరావతిలో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు చేసాం అని చంద్రబాబు  తెలిపారు.

అమరావతి ద్వారా  2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల సంపద వచ్చేది. అమరావతి కంటే ఆమోదయోగ్యమైన నగరం ఏముంది. విశాఖ-తిరుపతిలను మహా నగరాలుగా అభివృద్ధి చేయొచ్చు. అమరావతిలో ఏ భవనమూ తాత్కాలికం కాదు. 62 ప్రాజెక్టులకు అమరావతిలో శ్రీకారం చుట్టాం. వీటి విలువ దాదాపు రూ.53వేల కోట్లు. రూ.41వేల కోట్లపై చిలుకు ఇప్పటికే గ్రౌండ్ అయ్యాయి. అన్నీ అనుకున్నట్లు పూర్తయితే 62 వేల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవి. రైతులు చూపించిన చొరవతో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అమరావతిని ముందుకు తీసుకుపోవచ్చు. భవనాల నిర్మాణం ద్వారా పన్నులు వస్తాయి. తద్వారా ఆదాయం వస్తుంది. నిర్మాణం ద్వారానే ఎంతో ఆదాయం పొందవచ్చు. అన్నీ పోను 8 వేల ఎకరాలు మిగులుతుంది అని చంద్రబాబు వివరించారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox