Breaking News

ఎంపీ మోపిదేవి వాహనానికి ప్రమాదం...!

21 st Aug 2020, UTC
ఎంపీ మోపిదేవి వాహనానికి ప్రమాదం...!

ఆంధ్రప్రదేశ్  :ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది. అయితే, మోపిదేవి, శ్రీవాణి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకోగలిగారు. వారు ప్రయాణిస్తున్న కారు కాన్వాయ్ లోని ముందు వాహనాన్ని ఢీ కొట్టడం తో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం హైవే పైన ప్రయాణిస్తుండగా, ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, ఎంపీ మోపిదేవి వెంకటరమణలు ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. కాగా, వారి కాన్వాయ్ మధ్య లోకి వేరే ప్రైవేట్ వాహనం రావడం తో ఈ ప్రమాదం జరిగింది. మోపిదేవి వాహనానికి ముందుభాగం కొంతమేర పగిలిపోయింది. వీరిద్దరూ వేరే వాహనం లో విశాఖ కు వెళ్లారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox