Breaking News

నేటి నుంచి ఐదు రోజుల్లోనే పింఛన్..!

01 st Jun 2020, UTC
 నేటి నుంచి ఐదు రోజుల్లోనే పింఛన్..!

ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ పింఛన్ అమలు చేయడం లో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం నేటి నుంచి అమలు కానుంది. ఇక అర్హత కలిగిన వారికి నేటి నుంచి ఐదు రోజుల్లోనే పింఛన్ అందుతుంది. అర్హత కలిగిన వృద్దులకు దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లో  పింఛన్ అందిస్తామని జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ పింఛన్ ను గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా అందించనున్నారు. పింఛన్ మంజూరు అయినా మరుసటి నెలనుంచి లబ్దిదారులకు డబ్బు అందుతుంది. జూన్ 1 నుంచి ఈ విధానం అమలు చేయనున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈ విషయమై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox