Breaking News

ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజు ఖరారు చేసిన ఎపి ప్రభుత్వం..!

30 th Jul 2020, UTC

ఆంధ్రప్రదేశ్ : కరోనా మహమ్మారి చికిత్స తీసుకోవడానికి ఆరోగ్య శ్రీ ని అందించే ఆసుపత్రుల నెట్ వర్క్ లలో కానీ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ ఎంత ఫీజు వసూలు చేయాలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా  చికిత్సకు ఫీజు ఖరారు చేస్తూ ఆరోగ్య శాఖప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు.

కరోనా చికిత్సకు రోజుకు 3250 రూపాయలు, వెంటిలేటర్, ఎన్ ఐవి లేకుండా ఐసియూలో చికిత్స పొందుతుంటే రోజుకు 5480 రూపాయలు, ఎన్ ఐవి ఉండి ఐసియూ లో చికిత్స పొందుతుంటే 5980 రూపాయలు, వెంటిలేటర్ ఉండి ఐసియూలో చికిత్స పొందుతుంటే 9580 రూపాయలు, వెంటిలేటర్ ఉండి సెప్టిక్ షాక్ చికిత్స చేస్తే రోజుకు 10380 రూపాయలు చొప్పున వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం తన ఉత్తర్వులలో పేర్కొంది. 
            కరోనా మహమ్మారి భయం ఓ వైపు ప్రైవేట్ ఆసుపత్రులు చుక్కల్లో చూపిస్తున్న ధరలు మరో వైపు  కరోనా సోకితే పరిస్థితి ఇలా దుర్భరంగా ఉంటోంది. ఈ నేపధ్యంలో ఓ మధ్య తరగతి వ్యక్తి సైతం చికిత్స పొందే విధం గా ధరలు ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి కొంత మేర మధ్య తరగతి వ్యక్తుల జీవితాల్లో వెలుగు నింపవచ్చు. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox