Breaking News

కొవిడ్ టెస్ట్ కోసం ఏపీ ప్రత్యేక ఆప్..!

05 th Aug 2020, UTC
కొవిడ్ టెస్ట్ కోసం ఏపీ ప్రత్యేక ఆప్..!

ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధికం గా కరోనా టెస్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. టెస్ట్ లు చేయించుకున్న తరువాత ఫలితాలు రావడానికి రెండు మూడు రోజుల సమయం పడుతోంది. అయితే.. పరీక్షా ఫలితం తెలియడానికి మాత్రం ఏ విధమైన సదుపాయము ఇప్పటి వరకు లేదు. వారు పదే పదే పరీక్షా జరిపిన చోటుకి రావాల్సివస్తోంది. ఈ నేపధ్యం లో ఈ ఫలితాలను వెల్లడించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కొత్త ఆప్ ను రూపొందించింది.
          ఇందులో భాగంగానే కరోనా టెస్టులు చేయించుకున్న వారు తమ శాంపిల్ స్టేటస్‌ను తెలుసుకునేందుకు ఈ ప్రత్యేక ఆప్ ను తీసుకొచ్చింది.  ఏపీ ప్రభుత్వం కోవిడ్ 19 ఏపీ(COVID 19 AP) పేరిట నూతన యాప్‌ను లాంచ్ చేసింది. ఈ ఆప్ డౌన్ లోడ్ చేసుకుని..  శాంపిల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకుని మీ వివరాలను అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. మీకు సంబంధించిన మొత్తం డేటా తో కూడిన ఓ పీడీఎఫ్ ఫైల్ వస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని మీ ఫలితాన్ని చూసుకోవాలి.
           అసలు ఏపీ ప్రభుత్వం గతం లో పరీక్షా ఫలితాల కోసం ఓ వెబ్ సైట్ ను తీసుకొచ్చింది. కానీ.. పరీక్షా ఫలితాలు ఆలస్యం గా వస్తున్నాయంటూ కొందరు ఫిర్యాదు లు చేస్తున్నారు. ఈ నేపధ్యం లో ఏపీ ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆప్ ను తీసుకొచ్చింది. కరోనా టెస్టులు చేయించుకున్నవారు.. వారికి ఇచ్చిన శాంపిల్స్ నెంబర్, అధార్ కార్డు నెంబర్, ఫోన్ నెంబర్ ల వివరాలను అప్ లోడ్ చేయడం ద్వారా ఈ ఆప్ లో ఫలితాలను పొందవచ్చు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox