మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన స్వగ్రామం నిమ్మాడలో అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు.. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నపుడు నిభందనలకు విరుద్దంగా మందులు, ఇతర పరికరాల కొనుగోలు చేసారని చాల కాలం కిందటే ఆరోపణలు వచ్చాయి. వీటిపై దర్యాప్తు జరుపుతున్న ఏసీబీ ఇప్పటికే కొంత మంది అధికారులను కూడా అదుపులోకి తీసుకుంది.
ఈఎస్ఐ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఏసీబీ అధికారులు తెలిపారు. విజిలెన్స్ దర్యాప్తులోనూ ఇది తేలిందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడ సీబీఐ కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు అరెస్ట్ అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన ఏసీబీ అధికారులు స్కాం వివరాలను వెల్లడించారు.
ఈఎస్ఐ స్కాంలో విజిలెన్స్ నివేదిక వచ్చిందని, దాని ప్రకారమే తాము దర్యాప్తు చేశామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికశాఖా మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నకిలీ బిల్లులు సృష్టించిన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మందుల కొనుగోలులో మొత్తం రూ.150 కోట్ల కుంభకోణం జరిగినట్లు తేలిందని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని, వారిలో అచ్చెన్నాయుడుతో పాటు మాజీ ఈఎస్ఐ డైరెక్టర్లులు రమేష్ కుమార్, విజయ్ కుమార్ ఉన్నారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు.
కార్మిక శాఖ అధీనంలో వున్న ఈఎస్ ఐ ఆసుపత్రుల కు కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోలు మొత్తం ఇష్టారాజ్యంగా సాగిందని సమాచారం. 16 వేల రూపాయల విలువ చేసే
బయోమెట్రిక్ మిషన్ల మిషన్ కొనుగోలుకు 70 వేల రూపాయల మొత్తాలను వెచ్చించారని ,
అలాగే ల్యాబ్ కిట్లు, ఇంకా కేవలం రసీదుల్లో మాత్రమే చూపి మందులు కొనకపోవడం ఇవన్నీ జరిగిన అవినీతికి నిదర్శనాలని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Jan 2021
26 Jan 2021
27 Jan 2021
27 Jan 2021