Breaking News

బ్రిడ్జిని ఢీకొట్టి రెండుముక్కలయిన లాంచీ

21 st Aug 2020, UTC

ఆంధ్రప్రదేశ్ :తూర్పుగోదావరి జిల్లా తూర్పు ఏజెన్సీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.చింతూరులోని శబరి నది బ్రిడ్జిని ఢీ కొని లాంచీ మునిగిపోయింది. బ్రిడ్జిని ఢీకొని లాంచీ రెండు ముక్కలైనట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో లాంచీలో నలుగురు సిబ్బంది ఉండగా, పెంటయ్య అనే వ్యక్తి గల్లంతయ్యారు. కాగా, ఆ సమయంలో మరో బోట్‌లోని వ్యక్తులు వెంటనే స్పందించడంతో ముప్పు తప్పింది. ముగ్గురిని కాపాడగా పెంటయ్య గజ ఈతగాడు కావడంతో సురక్షితంగానే ఉంటాడని మిగతా సిబ్బంది చెబుతున్నారు. 
 
వరద బాధితులకు ముగ్గురు వ్యక్తులు లాంచీలో నిత్యవసర వస్తువులు పంచి వస్తుండగా చింతూరు బ్రిడ్జి వద్ద లాంచీ బ్రిడ్జిని ఢీ కొని మునిగిపోయినట్లు తెలియవచ్చింది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గత నాలుగైదు రోజులుగా గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు ఇదే ఉధృతి ఉంటుందని తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox