Breaking News

అగ్నిపథ్ అల్లర్ల కేసులో 31 మందికి బెయిల్ మంజూరు

23 rd Jun 2022, UTC

Andhrapradesh: అగ్నిపథ్ అల్లర్ల కేసులో అరెస్టయిన 31 మంది యువకులకు గుంటూరు మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇందులో 12 మంది ఐదు వేల రూపాయల పూచీకత్తుపై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలిన 19మందికి బెయిల్ మంజూరైనా ఐదువేల పూచీకత్తు చూపించకపోవడంతో విడుదల జాప్యం కానుంది.

అనంతపురం, నంద్యాల, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన ఆర్మీ ఉద్యోగ ఆశాహులను ఈనెల18న గుంటూరు నల్లపాడు వద్ద  పోలీసులు అరెస్టు చేశారు. కాగా తమపై కేసులు ఎత్తివేసి తమకు ఉద్యోగాలు వచ్చేలా చూడాలని యువకులు కోరుతున్నారు. గుంటూరు రైల్వేస్టేషన్‌ను ధ్వంసం చేసేందుకు, కులమతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించారంటూ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారని బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు తెలిపారు.

  • Tags