Breaking News

దుర్గమ్మ వెండి రథం సింహాలు చోరీ..!

16 th Sep 2020, UTC
దుర్గమ్మ వెండి రథం సింహాలు చోరీ..!

ఆంధ్రప్రదేశ్ :అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రధం అగ్నికి ఆహుతి అవడం పై ఏపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. హిందూ దేవాలయాల మీద దాడి జరుగుతోందని మరో వైపు విపక్షాలు విమర్శల దాడికి దిగబడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన మరో సారి చోటు చేసుకుంది. అమ్మవారి ఉత్సవాల్లో వినియోగించే వెండి రధం సింహాల్లో మూడు సింహాలు అదృశ్యమయ్యాయి. కరోనా లాక్ డౌన్ సమయంలోనే ఈ చోరీ జరిగిందని తెలుస్తోంది.

అయితే చోరీ జరిగిందని ఆలయ అధికారులకు తెలిసినప్పటికీ మౌనం వహించడం చర్చకు తావిస్తోంది. ఈ వెండి విగ్రహాల్లో ఒక్కో విగ్రహం సుమారు 8 కేజీల బరువు ఉండచ్చని అంచనా. ఈ లెక్క ప్రకారం రూ.15 లక్షల విలువైన 24 కేజీల వెండి మాయమైనట్లు సమాచారం. అంతర్వేది ఘటన తరువాత, పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై అధికారులు అలెర్ట్ అయ్యారు.

ఈ నేపధ్యంలో సోమవారం దుర్గగుడి ఈవో సురేష్ బాబు విజయవాడ నగర కమిషనర్ శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. ఆ తరువాత ఆలయ ఈవో, మరియు ఇతర సిబ్బందితో కలిసి ఆలయ రధాన్ని సందర్శించారు. ఈ సమయంలో రథానికి మూడు సింహాలు అదృశ్యమయ్యాయని గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో దుర్గగుడి ఈవో సురేష్ మాట్లాడారు. అంతర్వేది ఘటన నేపధ్యంలో ఈ సింహాలు మాయమయ్యాయని దుష్ప్రచారం జరుగుతోంది అని చెప్పుకొచ్చారు. తానూ ఈవోగా వచ్చాక ఇప్పటివరకు రధాన్ని వినియోగించలేదని, గతంలో సింహాలు ఉన్నాయా ? లేవా? అని గత రికార్డులు పరిశీలించి చెప్పడానికి 3రోజుల సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox