విజయవాడ స్వర్ణ పాలస్ ను రమేష్ హాస్పిటల్ వారు లీజు కు తీసుకుని కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ హోటల్ లో ఆది వారం తెల్లవారు జామున అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణం గా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన లో మృతుల సంఖ్యా ప్రస్తుతం 11 చేరింది.
పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు.. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో 50 మంది ఉన్నట్లు తెలుస్తోంది.. కాగా.. వీరిలో పదకొండు మంది మరణించారు. మిగిలిన వారు.. చికిత్స తీసుకుంటున్నారు. బాధితులను లబ్బీపేట, మెట్రోపాలిటన్ హోటల్, కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు ఒక్కసారిగా దట్టంగా పొగ అలుముకోవడంతో బాధితులు శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఘటనా స్థలాన్ని మంత్రి వెల్లంపల్లి, నగర సీపీ, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇంకా.. సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఫైర్ సిబ్బంది పీపీఈ కిట్లను ధరించి మృతదేహాలను బయటకు తీసుకు వస్తున్నారు.