Breaking News

కరోనా తో మరణిస్తే 10 లక్షల ఇన్సూరెన్స్.. టీటీడీ ఉద్యోగుల డిమాండ్

26 th Jul 2020, UTC

కరోనా నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు టీటీడీ ఉద్యోగుల జేఏసీ  లేఖ రాసింది. టీటీడీలో 250 మందికి కరోనా సోకిందని, కరోనా సోకిన వారికి ఇన్సూరెన్స్, కరోనాతో మరణించిన వారికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని  డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ 11 గంటల నుంచి అమలు అవుతోందని, అందువల్ల ఉదయం 7 నుంచి 11 వరకే టీటీడీ ఉద్యోగుల పనివేళలుగా మార్చాలని కోరారు.
 
 తిరుమలలో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఐఎస్‌ఓ నాణ్యతతో ఉన్న ఎన్-95 మాస్కులను ఇవ్వాలని లేఖలో కోరారు.ఉ ద్యోగుల కోసం నాలుగు కరోనా పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తేవాలన్నారు. 
 
కరోనాతో క్వారంటైన్‌లో ఉండి, తిరిగి ఇంటికి వెళ్లే ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేసి నెగటివ్ వచ్చిన వారినే ఇంటికి పంపాలని కోరారు. ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఉన్నావారికి అవకాశం ఇవ్వాలని, షిప్ట్ పద్ధతిలో 33 శాతం మందినే ఉద్యోగాలకు అనుమతించాలని టీటీడీ ఉద్యోగులు లేఖలో కోరారు.
 
టీటీడీ సిబ్బందిలో కరోనా కేసులు పెరగడం పట్ల ఉద్యోగులు అందోళన చెందుతున్నారు. తాజాగా పెద్ద జియ్యంగారికి కరోనా సోకడం, మాజీ ప్రధాన అర్చకులు కరోనాతో కన్నుమూయడం తెలిసిందే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox