అయోధ్య లో రామాలయాన్ని నిర్మించడానికి రఘురామ కృష్ణం రాజు తన మూడు నెలల జీతాన్ని విరాళం గా ఇచ్చారు.. ఇన్ని సంవత్సరాల పాటు కోర్టు లో నలిగినా కేసు ఎట్టకేలకు పరిష్కారం అయింది.. అయోధ్యలో రామాలయం నిర్మించుకోవడానికి అడ్డంకులు తొలగిన సంగతి తెలిసిందే.. మోదీ ప్రభుత్వం దేవాలయ నిర్మాణానానికి ఓ ట్రస్ట్ ను కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. ఈ ట్రస్ట్ చర్చల తరువాత దేవాలయ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కు ముహుర్తాన్ని ఫిక్స్ చేసింది. వచ్ఛేనెల అయిదవ తేదీన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమిపూజ చేయాలనీ ఈ ట్రస్ట్ సంకల్పించింది. కాగా.. ఈ ఆలయ నిర్మాణం కోసం ఆంధ్ర ప్రదేశ్ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన మూడు నెలల ఎంపీ వేతనాన్ని విరాళం గా ఇస్తున్నట్లు ప్రకటించారు.. వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు తన మూడు నెల జీతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అకౌంట్ కు జమ చేసారు.
ఈ విషయమై రఘు రామ కృష్ణం రాజు ఈ సందర్భం గా ప్రధాని మోదీ కి లేఖ రాసారు.... తాను తనకు తోచినది.. ఉడత భక్తి గా విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తం గా ఉన్న వందల కోట్ల హిందువులు అయోధ్యలో రామాలయం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన తన లేఖ లో పేర్కొన్నారు.