Prime9

Kuppam: కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికకు సర్వం సిద్ధం

కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికకు సర్వం సిద్ధమయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో కుప్పం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య జరగనున్నాయి. 22వ తేదీన ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో అధికార, ప్రతిపక్షాలు రెండూ ఆ పదవిని కైవసం చేసుకోవడానికి రంగంలో దిగాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన డాక్టర్‌ సుధీర్‌ తన మున్సిపల్‌ చైర్మన్‌ పదవితోపాటు కౌన్సిలర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. దాంతో మున్సిపల్ చైర్మన్ పదవికి ఇవాల ఎన్నిక జరగనుంది.

 

చైర్మన్‌ ఎన్నికలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య జరగనుండగా అధికార ప్రతిపక్షాలు పదవిని కైవసం చేసుకునేందుకు పట్టుదలతో ఉన్నాయి. గతేడాది చైర్మన్ పదవికి సుధీర్ రాజీనామా చేశాడు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. మున్సిపల్ కమిషనర్ వి.వెంకటేశ్వరరావు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రిసైడింగ్ అధికారిగా ఆర్డీవో వెంకటేశ్వరరాజు, పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఎన్నిక జరిగే హాలుకు వంద మీటర్ల దూరం వరకు 163 సెక్షన్ అమల్లో ఉందని డీఎస్పీ పార్థసారథి తెలిపారు.

 

Exit mobile version
Skip to toolbar