Prime9

AP High Court: రైతుల పాదయాత్రకు హైకోర్టు పచ్చ జెండా

Amaravati: రాజధాని రైతులు తలపెట్టిన అమరావతి టు అరసవళ్లి పాదయాత్రను కొనసాగించవచ్చంటూ హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్ధానం కొట్టేసింది. ప్రభుత్వం, జెఏసీ వాదనల విన్న అనంతరం  రైతుల పాదయాత్రకు కోర్టు అనుమతిచ్చింది.

ఐడి కార్డు ఉన్నవారే పాదయాత్రలో పాల్గొనాలని స్పష్టం చేసింది. వెంటనే రైతులకు ఐడీ కార్డులు ఇవ్వాలని పోలీసు అధికారులకు ధర్మాసనం ఆదేశించింది. సంఘీభావం తెలిపేవారు ఏ రూపంలో నైనా తెలపవచ్చని న్యాయస్థానం పేర్కొంది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాలని తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది.

రైతులు తలపెట్టిన పాదయాత్ర పై ఆధ్యంతం వైకాపా శ్రేణులు, ప్రభుత్వం రెచ్చగొట్టింది. విధ్వేషపూరిత ప్రసంగాలు చేశారు. అయినా మౌనంగా చేపడుతున్న రైతుల పాదయాత్ర పై దాడులకు దిగడంతో విధిలేని పరిస్ధితిలో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తగిన ఆదేశాలను జారీ చేస్తూ రైతుల పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి కోర్టుల్లో పదే పదే చెంప దెబ్బలు తినడం సదా మామూలుగా మారిపోయాయి.

ఇది కూడా చదవండి: Amaravati Petition: అమరావతి వాజ్యాన్ని నేను లేని ధర్మాసనంకు బదిలీ చేయండి.. చీఫ్ జస్టిస్ యు. యు. లలిత్

Exit mobile version
Skip to toolbar