Breaking News

జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కోసం తమిళనాడు ఉత్పత్తులు

26 th Apr 2022, UTC

Chennai: తమిళనాడుకు చెందిన మూడు ఉత్పత్తులు - పులియంకుడి యాసిడ్ లైమ్, తూయమల్లి బియ్యం మరియు విరుదునగర్ సాంబ వాతల్ (మిర్చి)  జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ( భౌగోళిక సూచిక ) కోసం దరఖాస్తు చేసుకున్నాయి. దీనికోసం ఏప్రిల్ 25న  చెన్నైలో దరఖాస్తు సమర్పించారు. 

తమిళనాడులోని పులియంకుడి అనే గ్రామం యాసిడ్ నిమ్మ సాగుకు ప్రసిద్ధి చెందింది. దీనిని తమిళనాడు 'నిమ్మ నగరం' అని పిలుస్తారు. ఈ ప్రాంతంలో పెరిగే నిమ్మకాయ 50 గ్రాముల బరువు ఉంటుంది మరియు ఒక్కో చెట్టు 900 నుండి 950 ఫలాలను ఇస్తుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కడయం నిమ్మకాయ దాని రుచి మరియు రసానికి ప్రసిద్ధి చెందింది. ఇది పులియంకుడి, శంకరన్‌కోవిల్, కడయం, కడయనల్లూరు, కురువికులం మరియు పరిసర ప్రాంతాలలో పెరుగుతుంది.

తమిళనాడులో ఎర్ర మిరపకాయలు ప్రధానంగా విరుదునగర్, రామనాథపురం, శివగంగ మరియు తూత్తుకుడిలో పండిస్తారు. మిర్చికి సంబంధించిన ప్రధాన మార్కెట్లు కూడా ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయి. విరుదునగర్ మిర్చి పొడవుగా, సన్నగా మరియు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది. ఇది 6 నుండి 6.5 సెం.మీ పొడవు  వుంటుంది. 

తూయమల్లి బియ్యం మల్లెపూలరంగులో వుంటాయి. ఈ రకం వరి వరి 135-140 రోజుల్లో చేతికి వస్తుంది. ఇది ఎకరాకు 1,125 కిలోల  వరకు దిగుబడి వస్తుంది. ఇందులో ప్రొటీన్లు ఐరన్, మెగ్నీషియం మరియు జింక్ అధికంగా ఉంటాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox