Breaking News

బడి లేక పనిబాట..!

18 th Jul 2020, UTC
బడి లేక పనిబాట..!

ప్రపంచాన్ని వణికిస్తూ పూర్తి స్థాయిలో విరుచుకుపడుతోన్న కరోనా మహమ్మారి  కొందరి జీవితాలను తారు మారు చేస్తోంది.. ఆడుతూ పాడుతూ బడికి వెళ్లాల్సిన చిన్నారులు పొలం బాట పట్టిన పరిస్థితి తూర్పుగోదావరి జిల్లాలో కనిపించింది.. స్కూళ్లకు నిరవధికంగా బ్రేక్ పడడంతో ఇంటి వద్దనే ఉంటోన్న చిన్నారులు వ్యవసాయంలో తండ్రికి సాయం చేస్తున్నారు..  తూర్పుగోదావరి జిల్లా పెదపూడి  మండలం పుట్టకొండ గ్రామానికి చెందిన  కొందరు చిన్నారులు తమ కుటుంబసభ్యులతో పొలంలో పని చేస్తున్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా వ్యవసాయం వైపే మొగ్గు చూపించే పరిస్థితులున్న నేపధ్యంలో స్కూల్ కి వెళ్లి చదువు కోవాల్సిన పిల్లలు ఇలా వరి నాట్లు వేయడం నేర్చుకుంటున్నారు.. కరోనా ప్రభావం ఎప్పటికి తగ్గుముఖం పడుతుందో.. ఎప్పుడు తిరిగి స్కూళ్లకు వెళ్తామో తెలియక చిన్నారులు కనీసం పొలం పనులైనా నేర్చుకుంటున్నారని అంటున్నారు పుట్టకొండకు చెందిన రైతు పాపారావు.. అయితే ఇంట్లో ఒక పక్క చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో వ్యవసాయంలో మెళుకువలు నేర్చుకోవడం భవిష్యత్తులో మంచిదేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. సిటి కల్చర్ లో సెల్ ఫోన్ లు, ఆన్ లైన్ గేమ్స్ కు పిల్లలు అతుక్కుపోతుంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు ఇలా అగ్రికల్చర్ వైపు అడుగులు వేయడం కరోనా చేసిన మేలనే అనుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox