Breaking News

అనంతపురం జిల్లాకు పీఎం కిసాన్ అవార్డు 

25 th Feb 2021, UTC
అనంతపురం జిల్లాకు పీఎం కిసాన్ అవార్డు 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ అవార్డును అనంతపురం జిల్లా గెలుచుకుంది.. బుధవారం న్యూఢిల్లీ లో నిర్వహించిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో పీఎం కిసాన్ జాతీయ అవార్డును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నుంచి జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  అందుకున్నారు. పీఎం కిసాన్ కింద లబ్ధిదారుల ఫిజికల్ వెరిఫికేషన్ విభాగంలో జిల్లాకు  జాతీయ అవార్డు  దక్కింది.

పీఎం కిసాన్ పథకానికి అర్హులైన వారిలో 28,505 మంది రైతుల వెరి ఫికేషన్ ను జిల్లా యంత్రాంగం పూర్తి చేయగా.. జాతీయ స్థాయిలో మరే జిల్లాలోనూ లేని విధంగా 99.60 శాతం రైతుల వెరిఫికేషన్ పూర్తి చేయడంతో జిల్లాకు జాతీయ అవార్డు వరించింది. జాతీయ అవార్డు అందుకోవడం పట్ల రైతుల కోసం జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి దేశ వ్యాప్త గుర్తింపు దక్కినట్టయిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆనందం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 లభిస్తాయి. అయితే ఈ డబ్బులు మూడు విడతలుగా బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. రైతులు పీఎం కిసాన్ వెబ్ సైట్ లో తమ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి బెనిఫిషరీ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox