Breaking News

ఒక్క మామిడి పండు ఖరీదు రూ.1,000 ఇదీ నూర్జహాన్ మామిడిస్పెషల్

07 th Jun 2021, UTC

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పండించిన '' నూర్జహాన్ '' మామిడి గత సంవత్సరంతో పోల్చితే  ఈ సంవత్సరం మంచి దిగుబడి రావడమే కాకుండా అధిక ధరను పొందుతోంది.ఈ సీజన్‌లో 'నూర్జహాన్  మామిడి ధర రూ. 500 నుండి రూ. 1,000 వరకు ఉంటుందని ఒక రైతుచెప్పారు, గత సంవత్సరానికి భిన్నంగా, అనుకూలమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ రకమైన మామిడి పండ్ల దిగుబడి ఈసారి బాగానే ఉంది.ఇండోర్ నుండి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుజరాత్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతంలో మాత్రమే  నూర్జహాన్  మామిడి పండ్ల ఆఫ్ఘన్ మూలానికి చెందినవని స్థానికులు పేర్కొన్నారు.

నా తోటలోని మూడు నూర్జహాన్ మామిడి చెట్ల నుంచి  250 మామిడి పండ్లు వచ్చాయి. వీటి ధర ఒక్కొక్కటి రూ.1,000 వరకూ వుంది. ఈ మామిడి పండ్ల కోసం ఇప్పటికే బుకింగ్‌లు జరిగాయని  కత్తివాడకు చెందిన మామిడి సాగు శివరాజ్ సింగ్ జాదవ్  తెలిపారు .ఈసారి నూర్జహాన్ మామిడి బరువు 2 కిలోల నుండి 3.5 కిలోల మధ్య ఉంటుంది అని జాదవ్ తెలిపారు.2019 లో ఈ రకానికి చెందిన ఒక మామిడి బరువు సగటున 2.75 కిలోలు మరియు కొనుగోలుదారులు దాని కోసం ఒక్కొక్క దానికి రూ. 1,200 చెల్లించారు" అని ఆయన చెప్పారు.

"నూర్జహాన్" మామిడి పండ్లను ముందుగానే బుక్ చేసుకున్న వారిలో మధ్యప్రదేశ్ మరియు పొరుగున ఉన్న గుజరాత్  రాష్ట్రాలవారు ఉన్నారు.నూర్జహాన్ ' రకం జూన్ ప్రారంభంలో పండ్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ చెట్లు జనవరి-ఫిబ్రవరిలో పుష్పించడం ప్రారంభిస్తాయి. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox