కరీంనగర్ :మాములుగా వంట రాని ఎవ్వరికైనా కనీసం రైస్ పెట్టడం తెలిసే ఉంటుంది. ఒకింత కొలత రైస్ కు రెండింతలు వాటర్ పోసి పెడితే రైస్ రెడీ అయిపోతుంది. కానీ, ఈ శ్రమ కూడా అవసరం లేకుండా వంట వండిచేయచ్చు తెలుసా? ఈ మేజిక్ రైస్ ఉంటె చాలు. కేవలం అందులో నీళ్లు పోస్తే నిమిషాల్లో అన్నం రెడీ అయిపోతుంది. నిజంగానే మేజిక్ లా అనిపిస్తోంది కదా. ఈ రైస్ ను తీసుకుని నీళ్ళల్లో పదినిమిషాలు నానపెడితే చాలు అన్నం రెడీ అయిపోతుంది.
కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం శ్రీరాముల పల్లెకు చెందిన శ్రీకాంత్ అనే రైతు వ్యవసాయం పై ఉన్న మక్కువతో ఈ మేజిక్ రైస్ ను సాగు చేస్తున్నాడు. ఈ రైస్ ను వండుకోవడం చాలా తేలిక. అలాగే, ఈ రైస్ లో ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ శాతం ఉంటుంది. ఫలితంగా ఈ రైస్ తిరగడానికి కొంత సమయం పడుతుందని శ్రీకాంత్ చెబుతున్నాడు. శ్రీకాంత్ కు చిన్నతనం నుంచే ప్రకృతి అంటే ఎంతో మక్కువ. శ్రీకాంత్ దాదాపు 9 రాష్టాలలో తిరిగి 120 రకాల వరకు వరి వంగడాలను సేకరించాడు.
అయితే, మేజిక్ రైస్ పై ఆసక్తితో ఈ పంటను పండిస్తున్నాడు. ఈ పంటను సాగు చేయడంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ ధైర్యంగా నిలబడి సాగు చేస్తున్నాడు. పంట సాగు సమయం జూన్ నుంచి డిసెంబర్ వరకు.145 రోజుల్లో ఈ పంట చేతికి వచ్చేస్తుందని చెబుతున్నాడు. ఈ బోకాసాల్ రకం బియ్యాన్ని పది నిముషాలు నీటిలో నానబెడితే సరిపోతుంది. చన్నీటితో వేస్తె, చల్లటి అన్నం, వేడి నీటిలో వేస్తె వేడి వేడి అన్నం రెడీ అయిపోతుంది. ఇదేదో భలే ఉంది కదా. అటు గ్యాస్ ఆదా అవుతుంది. మరో వైపు ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు. మరిన్ని వార్తలు చదవండి

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
19 Jan 2021
19 Jan 2021
19 Jan 2021
20 Jan 2021