Breaking News

ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన మామిడిపండు.. కిలో లక్షరూపాయలు

08 th Jun 2022, UTC

Andhrapradesh: కిలో మామిడిపండ్ల ధర రకాన్నిబట్టి నాలుగొందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంది. కానీ ఈ మామిడిపండు విలువ అక్షరాలా లక్షరూపాయలు. వినడానికి ఆశ్చర్యంగానూ, విడ్డూరంగానూ ఉన్నా ఇది నిజం. జపాన్ దేశానికి చెందిన "మియాజాకీ" అనే జాతికి చెందిన మామిడిపండ్లు మన దేశంలో లక్షలరూపాయల్లో ధర పలుకుతున్నాయి. 

ఏపీలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన ఓదూరి నాగేశ్వరరావు అనే రైతు నాలుగెకరాల పొలంలో ప్రపంచంలో ఉన్న వివిధరకాల మామిడిపండ్లను తాను, తన కుమారుడు కిశోర్ ఇరువురు  కలిసి స్వయంగా పండిస్తున్నామన్నారు. ఇందులో టెంకలేని మామిడి, యాపిల్ మామిడి, పలురకాల మామిడిపండ్లు ఉన్నాయి. అలాగే తెల్ల నేరేడుపండు కూడా తమ పొలంలో పండిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని మామిడిరకాలు తన పొలంలో పండించే విధంగా కృషిచేస్తున్నట్లు రైతు ఓదూరి నాగేశ్వరరావు, ఓదూరి కిశోర్ లు మీడియాకు తెలియజేశారు. మన దేశంలో అరుదుగా లభించే ఈ జపాన్ మియాజాకీ రకం మామిడిపండు తినాలనుకుంటే లక్షలరూపాయలు వెచ్చించాల్సిందేనంటున్నారు. 

జపాన్ దేశం నుండి తీసుకొచ్చిన మియాజాకీ జాతికి చెందిన మామిడి విత్తనాన్ని తన పొలంలో వేసి ఆ జాతి మామిడి చెట్లను పెంచుతున్నారు. ఈ మామిడిపండులో పోషకవిలువలు చాలా అధికంగా ఉంటాయని, ఒక్కో పండు మూడునుంచి నాలుగొందల గ్రాముల బరువు ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ మధురఫలానికి ప్రంపంచ మార్కెట్లో కిలో రెండున్నర లక్షల రూపాయల వరకూ ధర ఉందని నాగేశ్వరరావు తెలిపారు. ది కింగ్ ఆఫ్ మ్యాంగో  మియాజాకీ రకానికి చెందిన మామిడిపండు ప్రపంచంలోనే అతి ఖరీదైన మామిడి పండుగా కింగ్ ఆఫ్ మ్యాంగోగా గుర్తింపు పొందింది. జపాన్  దేశంలోని మియాజాకీ ప్రాంతంలో దీని మూలం ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. బయటకు సువాసనలు వెదజల్లుతూ, లోపల బంగారుఛాయతో మెరిసిపోతూ ఉండటం దీని ప్రత్యేకత. అంతేగాక అత్యధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం, క్యాన్సర్ను నిరోధించడం, కొలెస్ట్రా‌ల్‌ను తగ్గించడం, రోగనిరోధక శక్తి పెంచే గుణాలు ఉండటంతో పాటు చర్మసౌందర్యాన్ని పెంచే లక్షణాలు కూడా ఈ పండులో ఉండటం అత్యంత ఖరీదు పలుకుతోంది. 

ఇతర రకాలతో పోల్చితే కాపు కూడా తక్కువగా ఉంటుంది. దీంతో ఈ పండ్లకు అంతర్జాతీయ మార్కెట్లో కిలో 2లక్షలా 70 వేల రూపాయలు వరకు  ధర పలుకుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంత ఖరీదైన మామిడిపండ్లను విక్రయించడానికైతే కాదని, వీఐపీలకు మాత్రమే అందిస్తానని రైతు చెప్పడం కొసమెరుపు. తనకున్న నాలుగెకరాల్లోనే వందకు పైగా రకాల పండ్ల జాతి మొక్కలను పెంచుతున్నాడు. అరటి పండులా తొక్క వలుచుకుతినే బనానా మామిడి, యాపిల్ లా కనిపించే యాపిల్ మామిడి, నీలి రంగులో ఉండే బ్లూ మామిడి, టెంక లేని మామిడి, 365 రోజులు కాపు కాసే మామిడితో పాటు కేజీ బరువుండే సీతాఫలం, అరటి సపోటా, పిక్క లేని నేరేడు, తెల్ల నేరేడు, ఎర్ర పనస, స్ట్రాబెర్రీ , జామ, వంటి పండ్లు కూడా పండిస్తున్నారు ఈ రైతులు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox