Breaking News

ఏపీ రైతుల ఖాతాల్లో నేడు ఇన్ పుట్ సబ్సిడీ

15 th Feb 2022, UTC

Input subsidy today in AP farmers' accounts: ఏపీ రైతులకు శుభవార్త..  గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లో ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేయనుంది. వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది. మొత్తం రూ.542.06 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద రూ.29.51 కోట్లను కూడా జమ చేయనున్నారు. 

మొత్తం రూ.571.57 కోట్లను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేస్తారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతన్నలకు అందించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ అక్షరాల రూ.1,612.62 కోట్లు కావడం గమనార్హం.

మరిన్ని  ఆంధ్రప్రదేశ్ వార్తలు చదవండి

రోడ్ల పక్కన ధాబాల్లో మద్యం బంద్ చేయండి.. సీఎం జగన్ ఆదేశాలు

 భీమ్లా నాయక్ సినిమా టికెట్‌కు డబ్బులు లేవని విద్యార్థి ఆత్మహత్య

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox