భారత దేశం : ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎ్ఫ) ద్వారా
భారత్లో తొలి బ్యాచ్ గేదె దూడలు జన్మించాయని రేమండ్ గ్రూపునకు చెందిన జేకే ట్రస్టు గురువారం ప్రకటించింది. పుణె సమీపంలోని దౌండ్ జిల్లాలో ఉన్న సోనావనే ఫామ్లో నాలుగు గేదెల నుంచి ఐదు దూడలు జన్మించాయ ని వెల్లడించింది. ఐవీఎఫ్ విధానంలో ఒక గేదెకు కవల దూ డలు జన్మించడం ఇదే తొలిసారి అని పేర్కొంది.
ఐవీఎఫ్ పద్ధతిలో నాణ్యమైన పశుసంతతి సంఖ్యను మరింతగా పెం చవచ్చు. తాజాగా జన్మించినవి గేదెల్లో మేలుజాతిగా చెప్పే ముర్రా జాతికి చెందినవి. జేకేబొవజెనిక్స్ స్వచ్ఛంద సంస్థ ఈ ఐవీఎఫ్ ప్రక్రియను చేపట్టింది. తాజాగా సహాయక పునరుత్పత్తి సాంకేతికత(ఏఆర్టీ)ద్వారా గేదె దూడల్ని కూడా ఉత్ప త్తి చేసింది. దేశంలోని పాల దిగుబడి గణనీయంగా పెరిగేందుకు ఈ విధానం ఎంతగానే తోడ్పడుతుంది అని ఆ ప్రకటనలో పేర్కొంది.