Breaking News

తెల్లబంగారానికి పెరుగుతున్న డిమాండ్

30 th Sep 2020, UTC
తెల్లబంగారానికి పెరుగుతున్న డిమాండ్

న్యూఢిల్లీ :బారత్ ప్రత్తి ఎగుమతులకు అంతర్జాతీయరంగా మంచి డిమాండ్ పలకడంతో త్వరలోనే రేట్లు పెరుగుతాయని పరిశ్రమవర్గాలు ఆశిస్తున్నాయి. కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గత రెండు నెలల్లో 5 లక్షల బేళ్ల ప్రత్తిని ఎగుమతి చేసింది. ప్రత్తి ఎక్కువగా పండే ప్రాంతాల్లో అధిక వర్షాల కారణంగా తేమ ఎక్కువగా వుందని మరో వైపు తాజా పంట మార్కెట్ కు చేరడానికి  మరో 15 రోజులు  పడుతుందని తెలుస్తోంది. బంగ్లాదేశ్నుంచి ఆర్గానిక్ కాటన్ కు మంచి డిమాండ్ వుందని కాని ఆ స్దాయిలో ఎగుమతికి చేసేందుకు నిల్వలు లేవని వ్యాపారులు చెబుతున్నారు.

దేశంలో పండే ప్రత్తిలో మూడవ వంతు కాటన్ కార్పోరేషన్ సేకరిస్తుంది. తాము సేకరించిన 115 లక్షల ప్రత్తి బేళ్లలో ఇప్పటివరకు 57 లక్షల బేళ్లను అమ్మినట్లు కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. మిగిలిన స్టాకును కూడ మరో రెండు నెలల్లో విక్రయిస్తామన్నారు.బంగ్లాదేశ్ నుంచి మన ప్రత్తి దిగుమతులకు డిమాండ్ వున్న నేపధ్యంలో రెండు దేశాల మధ్య దీనిపై ఒప్పందం కూడ కుదుర్చుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

మరో వైపు ప్రత్తికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. క్వింటాల్ ప్రత్తికి ప్రభుత్వం రూ5,825 ప్రకటించింది. ప్రత్తి కొనుగోళ్లకు ఇప్పటికే ఉత్తర భారతంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని అక్టోబర్ 1 నుంచి దక్షిణ భారతంలో కొనుగోళ్లు చేపడతామని  సీసీఐ అధికారులు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox