Breaking News

ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలి

23 rd Apr 2022, UTC

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని, కానిపర్తి, దేశరాజు పల్లి, శంభుని పల్లి గ్రామాల రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న పంటకు నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని విన్నవించుకుంటున్నారు. తామంతా ఎస్సారెస్పీ కాలువ నీటి పై ఆధారపడి పంటలు సాగు చేస్తామన్నారు. 

ఈ నెల 25 వరకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేస్తామన్న అధికారులు సుమారు 10 రోజుల ముందుగానే కాలువ నీటిని నిలిపివేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఒక్క తడి సాగు నీటిని విడుదల చేస్తే మొక్కజొన్న పంట చేతికొస్తుందని, లేదంటే పంటలతో పాటు పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox