Breaking News

పది రోజుల్లో రైతుబంధు సాయం:సీఎం కేసీఆర్

16 th Jun 2020, UTC
పది రోజుల్లో రైతుబంధు సాయం:సీఎం కేసీఆర్

పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. యాసంగిలో ఏ పంటలు వేయాలో రైతులకు నిర్దేశం చేయాలి.. విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్‌ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందని సీఎం వివరించారు.

నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో సోమవారం (జూన్ 15) ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పంటల సాగు పరిస్థితిపై సీఎం సమీక్షించారు. జిల్లాల వ్యవసాయ అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు.ప్రభుత్వం సూచించిన విధంగానే అన్ని జిల్లాల్లో రైతుల పంటలు సాగు చేస్తున్నారని.. ఇప్పటి వరకు 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

రైతులందరూ ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత పద్ధతిలోనే పంటల సాగుకు అంగీకరించి దాని ప్రకారమే పంటలు వేసుకోవడానికి సిద్ధం కావడం హర్షణీయమని సీఎం అన్నారు. రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున వెంటనే వారికి రైతుబంధు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని.. రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం కేసీఆర్ నిర్దేశించారు.

రైతుబంధు డబ్బులు ఉపయోగించుకుని వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ వర్షాకాలంలో నియంత్రిత పంటల సాగు విధానానికి విజయవంతంగా తొలి అడుగు పడిందని.. వర్షాకాలం పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox