Breaking News

క్రాప్ హాలిడేకు సిద్దమయిన కోనసీమ రైతులు

07 th Jun 2022, UTC
క్రాప్ హాలిడేకు సిద్దమయిన కోనసీమ రైతులు

Konaseema: కోనసీమ రైతులు క్రాప్ హాలిడేకి సిద్ధమయ్యారు. కోనసీమ, అమలాపురం, ముమ్మిడివరం రైతులు జిల్లాలోని 12 మండలాల్లో క్రాప్ హాలిడే పాటించాలని కోనసీమ రైతు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. దీంతో ఐ.పోలవరంలో రైతుల ధర్నాకు దిగారు. వరిపొలంలోనే నినాదాలు చేస్తూ ఆందోళనలకు సిద్ధమయ్యారు. 

కోనసీమ రైతులు వ్యవసాయాధికారులకు వినతిపత్రాలు అందజేశారు. గత నెలలో రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో  దిక్కుతోచని స్థితిలో క్రాప్ హాలిడే‌కు సిద్ధమయినట్లు తెలిపారు.  ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని కోనసీమ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువులు, సాగు ఖర్చులు పెరిగిపోయాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ సక్రమంగా లేదంటూ కోనసీమ రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వర్షాకాలంలో పంట చేలు ముంపునకు గురవుతున్నాపట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. 

ఇప్పటికే ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు సమావేశాలు నిర్వహించారు. తొలకరి పంట వేయకూడదని తీర్మానాలు చేశారు. వరిసాగు గిట్టుబాటు కాక 2011లోక్రాప్ హాలిడే పాటించిన కోనసీమ రైతులు మరోసారి క్రాప్ హాలిడేకు సిద్ధం కావడం సంచలనంగా మారింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox