Breaking News

తెలంగాణలో బియ్యం సేకరణపై కేంద్రం కీలకనిర్ణయం

14 th May 2022, UTC

Hyderabad: తెలంగాణ నుంచి మ‌రో 6.5 లక్షల మెట్రిక్ ట‌న్నుల ఫోర్టిఫైడ్‌ పారా బాయిల్డ్ బియ్యం సేక‌రించాల‌ని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నాడు ఓ ప్రకటన రూపంలో కేంద్ర ఆహార‌, ప్రజా పంపిణీ వ్యవ‌హారాల మంత్రిత్వ శాఖ‌ తెలిపింది. బియ్యం భార‌త ఆహార సంస్థకు ఇవ్వాల‌ని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం స‌మాచారం పంపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే ఈ అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొన్నది.

తెలంగాణలో 2020-21 రబీ సీజ‌న్‌లో సేక‌రించాల్సిన బియ్యం గ‌డువును రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఇటీవ‌ల‌ మే- 2022 వరకు ఏడోసారి పొడిగించిన‌ట్లు మంత్రిత్వ శాఖ‌ పేర్కొన్నది. జూన్- 2022 వరకు సేకరణ కాలం, సెప్టెంబర్- 2022 వరకు మిల్లింగ్ వ్యవధితో 2021-22 (రబీ పంట)లో తెలంగాణలో 40.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణ అంచనాను కేంద్రం ఆమోదించింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox