Breaking News

అస్సాంలో కిసాన్ రధ్ యాప్ విడుదల

07 th Oct 2020, UTC
అస్సాంలో కిసాన్ రధ్ యాప్ విడుదల

అస్సాం :రైతులకు, పంట కొనుగోలుదారులకు ఉపయోగపడే విధంగా అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్ కిసాన్ రధ్ యాప్ ను విడుదల చేసారు. ఈ యాప్ రాష్ట్ర వ్యాప్తంగా వున్న10,000 మంది రైతులు, 50 రైతు సంఘాలు, 1,000 వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుదారులను సంఘటితం  చేస్తుంది. ఈ యాప్ ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ తయారు చేయగా అస్సాం అగ్రి బిజినెస్ అండ్ రూరల్ ట్రాన్స్ ఫర్మేషన్ (అపార్ట్) నిర్వహిస్తుంది. ఈ యాప్ అస్పామీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో లభ్యమవుతుంది. 

ఈ సందర్బంగా సీఎం సోనోవాల్ మాట్లాడుతూ అస్సాం రైతులు తమ ఉత్పత్తులను తగిన ధరలు పొందటానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో తమ ఉత్పత్తులకు దేశంలో ఎక్కడ మంచి ధర లభిస్తుందో తెలుసుకుని రైతులు మార్కెటింగ్ చేసుకుంటే వారు ప్రయోజనం పొందుతారని అన్నారు. నరేంద్ర మోదీ ప్రదాని అయ్యాక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, కిృషి సంచాయ్ యోజన, ఫసల్ భీమా యోజన పధకాలు ప్రవేశ పెట్టి రైతులకు సాయం చేసారని అన్నారు. అస్సాం వ్యవసాయ మంత్రి అతుల్ బోరా మాట్లాడుతూ ఈ యాప్ తో రైతులకు దళారీల బెడదలేకుండా మంచి ధర పొందుతారని అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox